వేస‌వి వేడికి జిడ్డు చ‌ర్మం మ‌రింత జిడ్డుగా మారుతుందా? అయితే ఇలా చేయండి!

వేస‌వి కాలం అంటేనే జిడ్డు చ‌ర్మ‌త‌త్వం క‌లిగిన వారు తెగ హైరానా ప‌డిపోతుంటారు.అందుకు కార‌ణం లేక‌పోలేదు.

 Best Home Remedy For Oily Skin!,home Remedy, Oily Skin, Skin Care, Skin Care Tip-TeluguStop.com

వేస‌వి కాలంలో అధిక వేడి, చెమ‌ట‌లు, ఉక్క‌పోత కార‌ణంగా జిడ్డు చ‌ర్మం మ‌రింత జిడ్డుగా మారుతుంటుంది.దాంతో ముఖం ఎంత తెల్ల‌గా ఉన్నా కాంతిహీనంగానే క‌నిపిస్తుంది.

పైగా ఆయిలీ స్కిన్ వల్ల అదనంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇతర చర్మ సమస్యల‌ను ఫేస్ చేస్తూ ఉంటారు.ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకుంటే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని త‌ర‌చూ ట్రై చేస్తే ఆయిలీ స్కిన్‌ను గ్లోయింగ్‌గా, ఫ్రెష్‌గా మెరిపించుకోవ‌చ్చు.

మ‌రి లేట్ చేయ‌కుండా ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక చిన్న కీర దోస‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి తొక్క‌తో పాటే చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే కొన్ని పుదీనా ఆకుల‌ను నీటిలో క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ట్ చేసుకున్న కీర దోస ముక్క‌లు, పుదీనా ఆకులు, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం, వ‌న్ ఎగ్ వైట్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Latest, Oily Skin, Skin Care, Skin Care Tips-Telugu H

ఆ త‌ర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో రెండు టేబుల్ స్పూన్ల‌ గోధుమ పిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్ లో ఈ రెమెడీని త‌ర‌చూ ట్రై చేస్తే.

చ‌ర్మంపై పేరుకుపోయిన అద‌న‌పు జిడ్డు తొల‌గిపోయి ముఖం గ్లోయింగ్‌గా, ఫ్రెష్‌గా మారుతుంది.మ‌రియు చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉన్నా త‌గ్గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube