వావ్, చిన్నారి కోసం చిట్టి వ్యాన్ తయారు చేసిన తండ్రి.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా తండ్రి కూతుర్లకు సంబంధించిన వీడియోలు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి.

 Father Creates A Mini Van For Her Daughter Video Viral Details, Girl, Father, V-TeluguStop.com

తాజాగా కూడా అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా ఫిదా చేస్తోంది.ఈ వీడియోలో ఒక తండ్రి తన కూతురు కోసం చిట్టి వ్యాన్‌ను తయారు చేశారు.

ఆ తర్వాత దాన్ని నడపడం ఎలాగో కూతురికి నేర్పించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

లాడ్‌ బైబిల్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసి ఈ వీడియోకి ఇప్పటికే లక్షలకు పైగా వ్యూస్, వేలకొద్ది లైకులు వచ్చాయి.ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి వ్యాన్ లో కూర్చొని ఉండటం చూడవచ్చు.రైసింగ్ ఇవ్వగానే ఆ వ్యాను చాలా వేగంగా ముందుకు దూసుకెళ్లడం కూడా గమనించవచ్చు.

దీంతో తల్లి ఓ మై గాడ్ అంటూ గట్టిగా అరుస్తూ భయపడిపోయింది.కానీ ఆ వ్యాన్ తర్వాత ఆగిపోయింది.

అదృష్టవశాత్తు ఆ చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.మరోసారి ఆ చిన్నారి వ్యాన్‌ను నడపడానికి ప్రయత్నించగా అది మరొకసారి దూకుడుగా ముందుకు వెళ్ళింది.

ఈసారి ఆ చిట్టి వ్యాన్ డోర్ ఓపెన్ అయింది.అంటే ఆ వ్యాన్ ఎంత ఫాస్టుగా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ఈసారి కూడా ఆ పాపకు ఏం జరగలేదు.అలా ఈ చిన్న పిల్ల రెండు సార్లు కారు స్పీడ్‌కి బిత్తరపోయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ డ్రైవింగ్ లెసన్ ఏదో బాగుందే అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.“ఈ వ్యాన్‌ హార్స్ పవర్ చాలా ఎక్కువగా ఉంది.ఇలా యాక్సిల్‌రేట్ ఇవ్వగానే అది అలా దూసుకుపోతుంది.

ఇది చిన్న పిల్లలకు సెట్ కాదు” అని మరో యూజర్ కామెంట్ పెట్టారు.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube