గుడివాడలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించాం డీఐజీ మోహన్ రావు..

గుడివాడలో క్యాసినో వ్యవహారం,నేడు జరిగిన ఉద్రిక్త పరిస్థితులపై సర్కిల్ పోలీసులతో సమావేశమైన ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి .

 Dig Mohan Rao Has Ordered A Full Investigation Into The Incident At Gudivada, Di-TeluguStop.com

మోహన్ రావు, ఎస్పీ సిద్ధార్ద్ కౌషల్.డీఐజీ మోహన్ రావు కామెంట్స్.

నేడు గుడివాడలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించాం.

రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలి.

ఆరుగురు సభ్యులతో టిడిపి నిజ నిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చాం, కానీ నిబంధనలు అతిక్రమించి వందలాది మందితో టిడిపి నాయకులు వచ్చారు.గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కృష్ణా జిల్లా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ, చాకచక్యంగ అదుపు చేశారు.

నిబంధనలను అతిక్రమించి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వందలాది మందితో నిజ నిర్ధారణ కమిటీ వెళ్లడంలో, కుట్రకోణం ఉందా అన్న అంశంపై విచారణ ప్రారంభించాం.

గుడివాడలో జరిగిన ఘటనపై ఎస్పి నేతృత్వంలో కమిటీ విచారణ చేస్తుంది.

తనను గృహ నిర్బంధం చేయండి అన్న వర్ల రామయ్య, గుడివాడలో రాద్ధాంతం చేయడం విశేషం నేడు పట్టణంలో జరిగిన ఘటనలో రెండు పార్టీలపై పోలీసులు సమానంగా వ్యవహరించారు.ప్రజాస్వామ్యబద్ధంగానే, ఆరుగురు సభ్యులతో టిడిపి నిజనిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చాము, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవు.

ఎస్పి సిద్దార్థ్ కౌశల్ కామెంట్స్ గుడివాడలో జరిగిన ఉద్రిక్త ఘటనలను అదుపు చేసేందుకు పోలీసులు వ్యక్తిగత రిస్క్ తీసుకొని ఎంతో ప్రయత్నించారు.వంద శాతం పోలీసుల కృషి వల్లే వివాదం పెద్దది కాలేదు తమకు అందిన పిర్యాదులు మేరకు విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

హద్దులు మీరి రాజకీయ కోణంలో ప్రశాంతత చెడగొట్టే వారిపై చర్యలు తప్పవు.రాజకీయ పార్టీల ప్రయోజనాల కంటే ప్రజల భద్రత, ప్రశాంతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ పోలీసులు ప్రొఫెషనల్ గా వ్యవహరించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube