వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరి మీద పడుతాడో అర్థం కాదు.ఆయన ఆ మద్య పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి చేసిన ట్వీట్స్ పతాక స్థాయికి చేరాయి.
పెద్ద మొత్తంలో ఆయన ట్వీట్స్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై అనుమానాలు కలిగేలా చేశాయి అనడంలో సందేహం లేదు.అయితే ఆయన వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు.
ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అందరు కూడా లైట్ తీసుకున్నారు.ఈ సమయంలో ఆయన సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన టికెట్ల ఇష్యూ పై మంత్రి తో భేటీ కోసం ఏకంగా అమరావతి వెళ్లాడు.
అక్కడ జరిగిన చర్చలు మరియు ఇతర విషయాలు ఆయన తీరును మళ్లీ ఇండస్ట్రీ లో చర్చించుకునేలా చేసింది.ఈ సమయంలో ఆయన ట్విట్టర్ ద్వారా కొడాలి నానికి సంబంధించిన విషయాలపై స్పందించడం మొదలు పెట్టాడు.
నిన్నటికి నిన్న రామ్ గోపాల్ వర్మ విడాకులు తీసుకోవడం మంచి నిర్ణయం.ప్రతి ఒక్కరు కూడా పెళ్లి జీవితం సంతోషంగా లేకుంటే హాయిగా విడాకులు తీసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.
స్టార్స్ విడాకులు తీసుకోవడం వల్ల యువత పెళ్లి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మ కొడాలి నాని పై పడ్డాడు.గుడి వాడలో ఆయన క్యాషినో మరియు ఇతర పలు విలాస వంతమైన ఆటలు ఆడిస్తున్నాడు.క్లబ్ లు నిర్వహిస్తూ గుడి వాడను గోవా చేశాడు అంటూ టాక్ వినిపస్తుంది.
ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మ గుడి వాడను మరియు గోవాను పోల్చుతూ సోషల్ మీడియాలో కొందరు చేసిన వ్యాఖ్యలు చేస్తున్నాడు.నెట్టింట ఈ విషయమై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ విషయమై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు.
గుడి వాడలో పరిస్థితుల గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ విషయమై నెట్టింట జరుగుతున్న ప్రచారం గుడి వాడను మళ్లీ వార్తల్లో నిలిపింది.
గోవా ను గుడివాడతో పోల్చడం కొందరు విమర్శిస్తూ ఉంటే మరి కొందరు గుడివాడ వాసులు మాత్రం గర్వంగా ఉందంటూ వింత వాదనతో ముందుకు వస్తున్నారు.మొత్తానికి వర్మ మరియు కొడాలి నాని ల మద్య ట్వీట్స్ వ్యవహారం మళ్లీ ఈ విషయంలో ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి.