గొంతులో కఫం పేరుకుపోవడం.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎందరినో సర్వ సాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
అందులోనూ ప్రస్తుత చలి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.గొంతులో కఫం పేరుకోవడం వల్ల దగ్గు, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, చికాకు, మింగడానికి తీవ్రమైన ఇబ్బంది, ఛాతి నొప్పి వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అందుకే కఫాన్ని తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఏవేవో మందులు వాడతారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఇంటి చిట్కాను ప్రయత్నిస్తే చాలా అంటే చాలా సులభంగా గొంతులోని కఫాన్ని నివారించుకోవచ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ ఇంటి చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఐదు మిరియాలు, రెండు యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకుని మెత్తటి పొడిలా దంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోసి హీట్ చేయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే.దంచి పెట్టుకున్న యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని.అందులో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి సేవించాలి.
ఇలా ప్రతి రోజు ఉదయాన్నే చేస్తే గనుక గొంతులో పేరుకు పోయిన కఫం మొత్తం క్రమంగా కరిగిపోతుంది.
అంతే కాదు, పైన చెప్పిన పానియాన్ని తీసుకోవడం వల్ల.
అందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారిస్తాయి.శ్వాస కోశలో అడ్డంకులు ఉంటే తొలగించి.
ఊపిరి ఫ్రీగా ఆడేలా చేస్తాయి.మరియు ఛాతిలో నొప్పి, మంట వంటి సమస్యలను సైతం తగ్గిస్తాయి.