ఆర్సీబీలోకి మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ బౌల‌ర్‌.. ఆరేండ్ల త‌ర్వాత‌

ఐపీఎల్ అంటే మ‌న దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే చాలు ఐపీఎల్ కోసం అంద‌రూ ఎదురు చూస్తుంటారు.

 Star Bowler Re-entering Rcb After Arendt After 6 Years, Michel Stark, Cricket-TeluguStop.com

ప్ర‌పంచంలో ఎన్ని ప్రాంచైజీలు వ‌చ్చినా స‌రే.ఐపీఎల్‌కు ఉన్న‌క్రేజ్ మాత్రం వేరే లెవ‌ల్‌.

అందుకే అన్ని దేశాల ప్లేయ‌ర్లు ఐపీఎల్ అంటే అంత ఇష్టం చూపిస్తుంటారు.కాగా ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత చాలా మార్పులు వ‌స్తున్నాయి.

ఐపీఎల్ కు ప్లేయ‌ర్ల‌ను వేలం వేయ‌డం ద‌గ్గ‌రి నుంచి రెండు కొత్త జట్లు కొత్త‌గా ఎంట్రీ ఇస్తున్నాయి.దీంతో ఈ సారి మ‌రింత జోష్ పెర‌గ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఇక ఆర్సీబీ విష‌యానికి వ‌స్తే మాత్రం ఈ సారి మ‌రింత జోష్ క‌నిపించేలా ఉంది.గ‌త ఆరేండ్లుగా ఆ జ‌ట్టుకు దూరంగా ఉంటున్న మిచెల్ స్టార్క్ ఈ సారి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

మిచెల్ స్టార్క్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.అత‌ను బౌలింగ్ లో ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును కూడా అందుకున్నాడు.

కాగా ఇప్పుడు మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు మిచెల్ స్టార్క్‌.ఈ ఆట‌గాడికి ఎడమచేతి వాటం ఉంది.

యార్క‌ర్లు వేయ‌డంలో చాలా దిట్ట‌గా పేరు తెచ్చుకున్నాడు.

Telugu Cricket, Michel Stark, Updat-Latest News - Telugu

పొట్టి ఫార్మాట్ క్రికెట్ లో అత‌న్ని మించిన బౌల‌ర్ లేడ‌నే చెప్పాలి.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క‌ప్ క‌ల‌గానే మిగిలిన ఆర్సీబీలోకి స్టార్క్ ఎంట్రీ ఇవ్వ‌డం చాలా మంచిద‌నే చెబుతున్నారు నిపుణులు.ఈ సారి అత్యంత బ‌లంగా ఆ జ‌ట్టు రెడీ కాబోతోంది.ఇక ఐపీఎల్ లో మిచెల్‌కు మంచి రికార్డు కూడా ఉంది.31 ఏళ్ల ఈ అత్యంత ఫాస్ట్ బౌలర్ ఆర్స‌బీకీ క‌ప్పు అందించ‌డంలో ఏ మేరుకు స‌క్సెస్ అవుతాడో అనేది అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.ఇత‌ని రాక కెప్టెన్ గా కోహ్లీకి ఎంతో క‌లిసి వ‌చ్చే అంశం.మ‌రి ఈ సారి ఆర్సీబీ అనుకున్న‌ది సాధిస్తుందా లేదా అన్న‌ది మాత్రం చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube