తెలంగాణలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.ముఖ్యంగా లోకల్ పార్టీగా ఉన్నా సరే.
జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని టీఆర్ ఎస్ ఆరాట పడుతోంది.ఒక టీఎంసీ పార్టీ లాగా, ఎన్సీపీ పార్టీ, శివసేన లాంటి పార్టీల లాగా.
నేషనల్ గుర్తింపు కోసం ఇప్పుడు టీఆర్ ఎస్ బాగానే ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగానే కేటీఆర్.
ఇప్పుడు జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే కేసీఆర్ అన్ని పార్టీలతో కలిసి కూటమిలో భాగం అయ్యే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.
కేటీఆర్ కూడా నేషనల్ లీడర్ అనే గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.
జాతీయ మీడియాలో ఆయన గురించి ఫోకస్ అయ్యేందుకు కొన్ని ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పంజాబ్ చెస్ ప్లేయర్ మల్లికాహండాకు సాయం చేయడానికి ముందుకొచ్చారంట.ఆమె పెట్టిన పోస్టుకు స్పందించిన కేటీఆర్.ఆమెను తెలంగాణకు రప్పించి మరీ.రూ.15 లక్షల సాయం అందజేశారు.వాస్తవానికి మల్లికా తన పోస్టులో గానీ.
మీడియా ముందు గానీ.పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శించిందే తప్ప.
కేటీఆర్ ను సాయం చేయమని గానీ.ఇతరులను గానీ సాయం అడుగలేదు.
మరి ఎందుకు పిలిచి మరీ ఇలా సాయం చేశారు అంటే దీని వెనక కేటీఆర్ స్వలాభం కూడా ఉందని సన్నిహిత వర్గాలలో ప్రచారం జరుగుతోంది.ఇటు వైపు చూస్తే.తెలంగాణలో ఎలాంటి సాయం అందక ఇబ్బంది పడుతున్న వారు అనేకమంది ఉన్నారు.అలాంటి వారికి సాయం చేయకుండా.ఇతర రాష్ట్రాలలో వారికి సాయం చేయడమేంటనేది ఇప్పుడు చర్చగా మారింది.ఇలాగే.
కునాల్ కమ్రాతో పాటు మునావర్ ఫారుఖీ జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయినప్పుడు కూడా వారికి కేటీఆర్ అండగా నిలబడ్డారు.ఇలా ఏదో ఒక విషయంలో కేటీఆర్ ఫేమస్ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.