రాధే శ్యాం, ఆదిపురుష్, సలార్ సినిమాల తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ తో స్పిరిట్ సినిమా ఎనౌన్స్ చేశాడు.
ప్రభాస్, సందీప్ వంగ డిఫరెంట్ కాంబోలో తెరకెక్కే ఈ సినిమాని టీ సీరీస్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.
ఇదిలాఉంటే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఏంటన్నది లీక్ అయ్యింది.
ప్రభాస్, సందీప్ వంగ ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చేస్తున్నారని తెలుస్తుంది.
సినిమాలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారట.సినిమాలో ప్రభాస్ లుక్, డిక్షన్ అన్ని చాలా కొత్తగా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటాయట.
అర్జున్ రెడ్డి సినిమాతో తన సత్తా చాటిన సందీప్ వంగ అదే సినిమా హిందీలో తీసి హిట్ కొట్టాడు.ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తున్న సందీప్ వంగ స్పిరిట్ తో మరోసారి నేషనల్ వైడ్ గా తన టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు.