నెలరోజుల గ్యాప్ లో 4 పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.ఈ నాలుగు సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ నాలుగు సినిమాల బడ్జెట్ ఏకంగా 1100 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాలలో కొన్ని అంశాలు ప్లస్ అవుతుంటే మరికొన్ని అంశాలు మైనస్ అవుతుండటం గమనార్హం.కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా సినిమాలు రిలీజవుతున్నాయి.
అఖండ ఫ్యామిలీ సమేతంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగా పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.పుష్ప మరికొన్ని గంటల్లో విడుదల కానుండగా బన్నీ, సుకుమార్ కాంబో కావడం ,సుకుమార్ రంగస్థలం తర్వాత బన్నీ అలా వైకుంఠపురములో తర్వాత చేస్తున్న సినిమా కావడం, బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.
అయితే పాత్రలు డీగ్లామరస్ గా కనిపిస్తుండటం, కొన్ని పాత్రల లుక్స్ మరీ భయంకరంగా ఉండటం, రెండు పార్ట్ లుగా తెరకెక్కుతుండటం పుష్పకు మైనస్ అవుతున్నాయి.
రాజమౌళి తర్వాత సినిమా కావడం ఆర్ఆర్ఆర్ కు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ కావడం, ఎక్కువ భాషల్లో రిలీజ్ కానుండటం, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఈ సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు.
ఆర్ఆర్ఆర్ మైనస్ ల విషయానికి వస్తే ఈ సినిమా ఆడియో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.కథ విషయంలో ప్రేక్షకులలో కన్ఫ్యూజన్ నెలకొంది.జక్కన్న చరిత్రను వక్రీకరిస్తున్నారని చాలామంది భావిస్తున్నారు.
బాహుబలి స్థాయి ప్రమోషన్ ఆర్ఆర్ఆర్ కు లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.మల్టీస్టారర్ కావడం పవన్, రానా కలిసి నటిస్తుండటం భీమ్లా నాయక్ కు ప్లస్ అయ్యాయి.
పాటలు ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి.
రీమేక్ మూవీ కావడంతో ఒరిజినల్ తో పోల్చి చూసే ఛాన్స్ ఉండటం, కథలో మార్పులు చేశారని జరుగుతున్న ప్రచారం ఈ సినిమాకు మైనస్ అవుతున్నాయి.ప్రభాస్, పూజా హెగ్డే కాంబో రాధేశ్యామ్ కు ప్లస్ కాగా హిందీలో భారీ అంచనాలు నెలకొనడం, లవ్ స్టోరీ కావడం, పాటలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.ఈ సినిమా డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ కాకపోవడం, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు లేకపోవడం, సినిమాలో యాక్షన్ సీన్లు లేవని జరుగుతున్న ప్రచారం రాధేశ్యామ్ కు మైనస్ అయ్యాయి.
ఈ సినిమాలల్లో ఏ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.