డార్క్ సర్కిల్స్.దీనినే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు అని అంటారు.
వయసుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులెందరినో వేధిస్తున్న చర్మ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శరీరంలో అధిక వేడి, డీహైడ్రేషన్, పోషకాల లోపం, పలు రకాల మందుల వాడకం.
ఇలా రకరకాల కారణాల వల్ల కళ్లు చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.ఇవి చూసేందుకు అసహ్యంగా ఉండటమే కాదు.
ముఖ సౌందర్యాన్ని సైతం దెబ్బ తీస్తాయి.
ఈ నేపథ్యంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములు ఎన్నో వాడతారు.అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ అండ్ ఎఫెక్టివ్ క్రీమ్‌ను వాడితే గనుక చాలా సులభంగా డార్క్ సర్కిల్స్‌ను నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అర కప్పు కీర దోస ముక్కలు, అర కప్పు బంగాళదుంప ముక్కలు, ఒక కప్పు కొత్తిమీర తీసుకుని విడి విడిగా పేస్ట్ చేసి రసం తీసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల కలబంద జెల్, ఒక స్పూన్ బంగాళ దుంప రసం, ఒక స్పూన్ కీర దోస రసం, ఒక స్పూన్ కొత్తిమీర రసం, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.
దీనిని ఒక గాజు సీసాలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.ఇక ఈ న్యాచురల్ క్రీమ్‌ను వాడాలంటే.మొదట కళ్ల చుట్టూ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆ తర్వాత వేళ్లతో తయారు చేసుకున్న క్రీమ్‌ను తీసుకుని కళ్ల చుట్టూ అప్లై చేసి స్మూత్‌గా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
డ్రై అయిన తర్వాత కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేస్తే డార్క్ సర్కిల్స్ దూరం అవుతాయి.