తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ – Telugu NRI America News

1.ఇద్దరు భారతీయులకు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు

ఇద్దరు భారతీయులపై సింగపూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాగే భారీ జరిమానా ను విధించింది.కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం పై శ్యామలరావు, అతీస్ రావ్ అనే ఇద్దరికీ ఒక్కొక్కరికి 1500 సింగపూర్ డాలర్ల ఫైన్ విధించింది.

2.ఫోర్బ్స్ జాబితాలో 166 మంది భారతీయులు

ఫోర్స్ కుబేరుల జాబితాలో 166 మంది భారతీయులు ఉన్నారు.వీరిలో 12 మంది తెలుగు వారు.

3.చైనా, యూకే లో కరోనా తీవ్రతరం

చైనా, యూకే లో కరోనా తీవ్రతరం అవుతోంది. కరోనా కట్టడికి పలు నగరాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

4.రష్యా కు వ్యతిరేకంగా భారత్ గళం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి రష్యా ఉక్రెయిన్ యుద్ద వ్యవహారం పై స్పందిందించింది.రష్యా తీరుని తప్పుపడుతూ తిరుమూర్తి మాట్లాడారు.

5.ఆర్ ఎస్ ఎస్ పై ఇజ్రాయిల్ కాన్సుల్ సంచలన వ్యాఖ్యలు

భారతదేశ నిర్మాణంలో ఆర్ ఎస్ ఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఇజ్రాయిల్ కాన్సుల్ జనరల్ కొచ్చి శోసాని అన్నారు.

6.శ్రీలంక కు భారత్ మందుల సాయం

Advertisement

శ్రీలంక లో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అయిన నేపథ్యంలో ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ ఇప్పటికే అనేక మార్గాల్లో సహాయాన్ని అందిస్తోంది.తాజాగా శ్రీలంక కు అవసరమైన మందులను పంపి భారత్ తన ఉదారత ను చాటుకుంది.

7.కెనడా చట్ట సభలో కొత్త బిల్లు ప్రతిపాదన

కెనడా చట్ట సభలో ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు.

ఆన్లైన్ న్యూస్ పోర్టళ్లకు ఇప్పటి వరకు గూగుల్, ఫేస్ బుక్ లు వాణిజ్య ప్రకటనల ద్వారా నే నామమాత్రపు చెల్లింపులు చేస్తున్నాయి.కెనడా ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన చట్టం అమల్లోకి వస్తే ఇకపై ఆయా సైట్లకు వార్తల ఆధారంగానూ ఫేస్ బుక్, గూగుల్ డబ్బులు చెల్లించక తప్పదు.

8.పుతిన్ కుమార్తె పై ఆంక్షలు ఈయూ సిద్ధం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి.అయినా ఆయన్ను కట్టడి చేయలేకపోవడం తో ఆయన కుమార్తె మారియా, క్యాథరినా లపై  ఆంక్షలు విధించే దిశగా యురోపియన్ యూనియన్ ( ఈయూ ) దేశాలు సిద్ధం అవుతున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు