కెసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో చిక్కుల్లో పడ్డ బీజేపీ

తెలంగాణ రాజకీయాలు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారాయి.తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు లేడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.

 The Bjp Is Embroiled In This Decision Taken By Kcr Telangana Politics, Trs Party-TeluguStop.com

ప్రస్తుతం టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా మారాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోన్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం చాలా వరకు బీజేపీని రకరకాల అంశాలమీద ఇరుకున పెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.

తాజాగా వరి ధాన్యం కొనుగోళ్ళ విషయంలో బీజేపీని ఇరుకున పెట్టిన కేసీఆర్ బీజేపీని రైతు వ్యతిరేక పార్టీగా ముద్ర పడేయాలని వేసిన వ్యూహంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులను కూడా వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అందుకే నేటి నుండి మూడు రోజుల పాటు సింగరేణి కార్మికులు సమ్మె సైరన్ ను మోగించిన విషయం తెలిసిందే.దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాన మంత్రికి సింగరేణి బొగ్గు వేళాన్ని నిలిపివేయాలని లేఖ రాసిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థకు కావచ్చు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఈ తరహా నిర్ణయాలతో ప్రాణాలకు తెగించి పని చేసే కార్మికులకు అన్యాయం చేయకూడదని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Telugu @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bjp, Employess, Formmers, Singa

ఇక ఈ సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో బీజేపీ మరో సారి చిక్కుల్లో పడే అవకాశం ఉంది.ఏది ఏమైనా ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ పై గట్టి స్వరంతో ముందుకెళ్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ బీజేపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube