తెలంగాణ కాంగ్రెస్ లో చాలా విపత్కర పరిణామాలు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.కలహాల పార్టీగా పేరొందిన కాంగ్రెస్ లో ఐక్యరాగం వినిపించడం రాజకీయ విశ్లేషకులనే కాదు ఇతర పార్టీల వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఎన్నడూ లేని విధంగా అందరం రేవంత్ ఆధ్వర్యంలో నడుస్తామని రేవంత్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వీహెచ్ లాంటి నేతలు బహిరంగంగా మీడియా ముఖంగా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
అంతేకాక ఇటీవల ఇందిరా పార్క్ లో జరిగిన రైతు ధర్నాలో ఉప్పు నిప్పులా ఉండే కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి అత్యంత అన్యోన్యంగా కలిసిపోవడంతో తెర వెనుక ఏదో భారీ మంత్రాంగం జరిగి ఉండవచ్చు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఈ తరహా ఘటనలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది కలనా నిజమా అన్న రీతిలో చర్చ జరుగుతుందట.అయితే దీని వెనుక సోనియా గాంధీ హస్తం ఉన్నట్లు ఒక వాదన బలంగా వినిపిస్తోంది.
వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికీ ఇంకా పార్టీలో కలహాలు ఉంటే పార్టీ బలపడటం చాలా కష్టమనే భావన సోనియా గాంధీ వ్యక్తం చేయడంతో ఇక చాలా వరకు నేతలు కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
అయితే ఎందుకంటే చాలా వరకు నేతలు క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల వెంట నడిచి వారితో కలసి నేతలు పోరాడితేనే ప్రభుత్వ వ్యతిరేక కాంగ్రెస్ పోరాటం అనేది ప్రజల్లోకి వెళ్తుంది.లేకుంటే రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి మాత్రమే పరిమితమైతే కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు.ఏది ఏమైనా కాంగ్రెస్ లో ఒక ఐక్య రాగం వినిపించడం శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు.