ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా జాతర జరుగుతోందని చెప్పవచ్చు.కరోనా కారణం వల్ల వాయిదా పడిన సినిమాలు అన్నీ ఒకేసారి పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాల నుంచి ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతారు.ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నటువంటి పుష్ప, RRR సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అలాగే రాజమౌళి RRR జనవరి 7వ తేదీన విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్లను ఒకే రోజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.ఈ క్రమంలోనే డిసెంబర్ 3వ తేదీ న RRR చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయాలని చిత్రబృందం ప్రకటించారు.
అయితే అనుకోకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు మరణించడంతో ఇది కాస్త వాయిదా పడి డిసెంబర్ 6వ తేదీకి వెళ్ళింది.ఈ క్రమంలోనే డిసెంబర్ 6వ తేదీ RRRథియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనుండగా అదే రోజే పుష్ప సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదలచేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో అభిమానులకు పండుగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు.ఇక పోతే ఈ రెండు సినిమాల నుంచి ఒకే రోజు అప్డేట్ రావడంతో ఈ సినిమాల గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.