కంబోడియాలో విల్లాపేరు చెప్పి.. రూ.4కోట్లు ఎగ‌రేసుకుపోయాడు

రోజ‌రోజుకూ మోసాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో అంద‌రం చూస్తూనే ఉన్నాం.అస‌లు ఎవ‌రిని న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

 Saying The Name Of The Villa In Cambodia .. Rs 4 Crore Gone, 4 Crores Cheating,-TeluguStop.com

మ‌న వెంటే ఉండే వారు కూడా ఏదో ఒక స‌మ‌యంలో నిండా ముంచుతున్న ఘ‌ట‌న‌లు మ‌నం అనేకం చూస్తున్నాం.నా అనుకున్న సొంత‌వారే ముంచేస్తున్న ఈ రోజుల్లో బ‌య‌టి వారి విష‌యంలో ఇంకెంత జాగ్ర‌త్త‌గా ఉండాలో ఓ సారి ఆలోచిస్తే బెట‌ర్‌.

అయితే ఇలా ఎన్ని ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నా స‌రే గుడ్డిగా ఎవ‌రినో ఒక‌రిని న‌మ్మి చివ‌ర‌కు నిండా మోస‌పోతున్నారు చాలామంది.

ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటుచేసుకుంది.

దీన్ని చూస్తే మాత్రం అంద‌రూ షాక్ అయిపోతున్నారు.జూబ్లీహిల్స్ కు చెందిన ఆదిత్య బిజినెస్ చేస్తుంటాడు.

ఆయ‌న‌కు కొంత కాలం క్రితం ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి పరిచయమ‌య్యాడు.అప్ప‌టి నుంచి అత‌నితో నిత్యం కొన్ని ర‌కాల బిజినెస్ ల గురించి మాట్లాడుతూ ఉండేవారు ఆదిత్య‌.

ఇలా ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది.అయితే ఓ సారి కంబోడియాలో భూముల వ్యాపారం బాగుంటుంద‌ని పెట్టుబ‌డి పెట్టాలంటూ ఆదిత్య‌ను కోరాడు కిర‌ణ్‌.

Telugu Busseness, Fraud, Hyderabad, Kombodia, Villa-Latest News - Telugu

ఇక కిర‌ణ్ మాట‌లు న‌మ్మిన ఆదిత్య అలాగే పెట్టుబ‌డులు పెట్టేద్దామ‌ని డిసైడ్ అయిపోయాడు.ఇక కిర‌ణ్ చెప్పిన‌ట్టుగానే ముందుగా రూ.4 కోట్లు డబ్బులు పంపించేశాడు.అయితే కొద్ది రోజుల వ‌ర‌కు ఏదో ఒక‌టి చెప్పి త‌ప్పించుకునేవాడు కిరణ్.

ఇక ఎంత‌కూ కిర‌ణ్ కంబోడియా నుంచి తిరిగి రాక‌పోవ‌డంతో తాను మోసపోయాన‌ని గ్ర‌హించిన ఆదిత్య వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.ఇక డబ్బులు కూడా ఇవ్వకపోవటంతో ఇంత‌లా మోసం చేశాడంటూ ఆవేదన చెందుతున్నాడు ఆదిత్య‌.

కాబ‌ట్టి మోసం చేయాల‌నుకునే వారు మ‌న చుట్టూనే ఉంటార‌నేది అంద‌రూ గ్ర‌హించాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube