చెరో దారిలో కిషన్ రెడ్డి- బండి సంజయ్...వ్యూహంలో భాగమేనా?

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.అయితే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేని కారణంగా టీఆర్ఎస్ తరువాత బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోంది.

 Kishan Reddy-bandi Sanjay On The Way To Chero ... Is It Part Of The Strateg Tela-TeluguStop.com

ఈ క్రమంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే వరుస ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తుండటంతో ఇక బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే చాలా వరకు బీజేపీ అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున వార్తలు విన్పిస్తున్న వేళ బీజేపీలో ఏదో జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అందుకు ప్రధాన ఉదాహరణ  తాజాగా యాసంగిలో వరిని సాగు చేయాలని కెసీఆర్ మెడలు వంచైనా ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారాన్ని రేపాయన్నది మనం చూశాం.

  అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి విలేఖరులు కిషన్ రెడ్డిని ప్రశ్నించడంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించలేనని తెలపడం జరిగింది.దీంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య విభేదాలున్నాయా అనే చర్చ జరుగుతోంది.

Telugu Bandi Sanjay, Bjp, Central, Formmers, Kishan Reddy, Paddy, Telangana, Tel

అయితే బండి సంజయ్ దూకుడుగా వెళ్తుండటంతో బీజేపీ పార్టీ కేంద్ర నాయకత్వం ఇబ్బందులు ఎదుర్కోవడంతో కేంద్రం నుండి బండి సంజయ్ కి వార్నింగ్ వచ్చినట్లుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అయితే ఈ ప్రచారంపై బీజేపీ కూడా స్పందించలేదు.అయితే ఒకరి వ్యాఖ్యలపై ఇంకొకరు స్పందించకూడదు అనే ఉద్దేశ్యంతోనే స్పందించడం లేదా అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం చాలా వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడంపైనే పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పటికే స్థానికంగా క్యాడర్ ను నిర్మించడానికి పెద్ద ఎత్తున కార్యాచరణను ఇప్పటికే బీజేపీ పార్టీ ప్రారంభించిందని మనం చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube