కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి మూడు వారాలు అయినా పునీత్ అభిమానులు మాత్రం పునీత్ ను మరిచిపోలేకపోతున్నారు.పునీత్ రాజ్ కుమార్ కు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారని తెలిసి ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు సైతం షాకయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సామాన్యులను సైతం అవాక్కయ్యేలా చేశాయి.పునీత్ చేసిన గొప్ప పనులను అభిమానులు తరచూ తలచుకుంటూ ఉన్నారు.
తాజాగా కర్ణాటక అటవీ శాఖ అధికారులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.శివమొగ్గ దగ్గర సక్రబైలు ఏనుగు శిక్షణ కేంద్రంలో ఉండే ఒక గున్న ఏనుగుకు అధికారులు పునీత్ రాజ్ కుమార్ పేరును పెట్టారు.
ఆ ఏనుగు వయస్సు రెండు సంవత్సరాలు కాగా పునీత్ రాజ్ కుమార్ కు ఆ ఏనుగు అంటే ఎంతో ఇష్టమని అధికారులు పేర్కొన్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పునీత్ రాజ్ కుమార్ ఈ క్యాంపును సందర్శించారు.
ఆ సమయంలో రెండు సంవత్సరాల వయస్సు ఉన్న గున్న ఏనుగుపై పునీత్ రాజ్ కుమార్ విపరీతమైన వాత్సల్యాన్ని చూపించడం గమనార్హం.
గున్న ఏనుగు పునీత్ కు ఎంతో ఇష్టమైన ఏనుగు కావడంతో అధికారులు ఆ ఏనుగుకు పునీత్ పేరును పెట్టారు.సాధారణంగా దేవుళ్ల పేర్లను మాత్రమే ఏనుగుకు పెట్టడం జరుగుతుందని స్థానికులు, సిబ్బంది కోరిక ప్రకారం గున్న ఏనుగుకు మాత్రం పునీత్ పేరు పెట్టామని అధికారులు తెలిపారు.
ఏనుగు సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ కోసం పునీత్ ఏకంగా గున్న ఏనుగుతో మూడు నెలల సమయం గడిపారని అధికారులు పేర్కొన్నారు.గున్న ఏనుగుకు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టడం గురించి పునీత్ అభిమానులు సైతం సంతోషిస్తున్నారు.పునీత్ మరణం తర్వాత పునీత్ ఫ్యాన్స్ లో చాలామంది నేత్రదానానికి ముందుకు రావడం గమనార్హం.