మాస్ రాజా రవితేజ మంచి హుషారుగా ఉన్నాడు.కరోనా వంటి క్రైసిస్ లో కూడా మాస్ రాజా క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మరింత జోష్ లో ఉన్నాడు.
ఇక ప్రెసెంట్ రవితేజ చేస్తున్న కొత్త చిత్రాల్లో ‘ఖిలాడీ‘ ఒకటి.రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా మే లోనే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటి వరకు ప్రకటించక పోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.అయితే ఖిలాడీ సినిమా ఎలాగైనా ఈ ఏడాదిలోనే వస్తుంది అని అనుకున్న రవితేజ ఫ్యాన్స్ ఆలోచనలు తల్లక్రిందులు చేస్తూ తాజాగా ఈ సినిమా నుండి కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్టు ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ద్వారా ఈ విషయాన్నీ తెలిపారు.ఇక ఇటీవలే ఈ సినిమా లోని లాస్ట్ సాంగ్ షూటింగ్ ను దుబాయ్ లో హీరో హీరోయిన్ల పై జరిపారు.ఇక ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఈ సినిమాలో డింపుల్ హయతి తో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పటు మరో మూడు ప్రాజెక్ట్ లలో కూడా రవితేజ నటిస్తున్నాడు.రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలతో పాటు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు.