డ్యాన్స్ చేయడం అనేది ఒక అందమైన కల.అది అందరికీ సాధ్యం కాదు.
అన్ని రంగాల్లో ఉన్న వారు కూడా డ్యాన్స్ చేయాలని ఎంతో ఆశ పడుతుంటారు.ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో డ్యాన్స్ చేసే అవకాశం వస్తుంది.
కానీ అందమైన స్టెప్పులతో డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు.అది కొందరికి పుట్టుకతోనే వచ్చేస్తుంది.
అందుకే వారు చాలా ఈజీగా డ్యాన్స్ నేర్చేసుకుంటారు.అంతెందుకు మనం చాలాసార్లు పేదరికంలో మగ్గుతున్న వారు కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఘటనలు ఎన్నో చూశాం.
ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే వైరల్ అవుతోంది.
నెట్టింట డ్యాన్స్ వీడియోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఏ ఒక్కరు అద్భుతమైన స్టెప్పులు వేసినా సరే అలాంటి వారిని వెతికి పట్టుకుని మరీ సోషల్ మీడియాలో వారి డ్యాన్స్‌ను పాపులర్ చేసేస్తుంటారు.ఇక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ వంతు వచ్చింది.
వారు అద్భుతమైన, అందమైన డ్యాన్స్ తో అదరగొట్టేశారు.ఎయిర్ హోస్టెర్స్ అంటే కేవలం విమానాల్లో సర్వీసులు అందించడం మాత్రమే కాదని ఇలాంటి అద్భుతమైన ట్యాలెంట్ కూడా తమకు ఉంటుందని నిరూపించారు.
ఇండిగో ఎయిర్‌లైన్, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌లు ఈ పని చేశారు.
ఈ మధ్య సోషల్ మీడియాను ఊపేస్తున్న మనికే మేజ్ హితే పటకు ఇండిగో ఎయిర్ హోస్టెస్ అందమైన స్టెప్పులు వేశారు.
ఉమా మీనాక్షి తన కొలీగ్ తో కలిసి యూనిఫామ్ లోనే అందంగా డ్యాన్స్ చేసింది.ఇంకేముంది దాన్ని వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.
ఎయిర్ బ్రిడ్జ్ ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిపై వీరిద్దరూ కలిసి అత్యంత అందంగా డ్యాన్స్ చేయడాన్ని చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.ఇప్పటికే ఈ వీడియో చాలా వైరల్ గా మారింది.
దీన్ని చూసిన వారంతా కూడా రకరకాల కామెంట్లు పెట్టేస్తున్నారు.మరి లేటెందుకు మీరు కూడా మీ కామెంట్ పెట్టేయండి.
.