డాలస్‌లో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిన నాట్స్

డాల్లస్, టెక్సాస్: నవంబర్:7 అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగువారి కోసం ఉచితవ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది.నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డాలస్ లో దాదాపు 500 మందికిపైగా తెలుగు చిన్నారులకు వ్యాక్సిన్స్ వేశారు.

 Knots Who Took The Vaccine Drive In Dallas , Dallas, Texas , Great Pharmacy, An-TeluguStop.com

ఇందులో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సిన్ వేయడం జరిగింది.ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న పెద్దలకు బూస్టర్ డోస్ ఇచ్చారు.

గ్రేట్ ఫార్మసీ, అండ్ ఇండిపెండెన్స్ ఫార్మసీ వాళ్లసహకారంతో నాట్స్ ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించింది.నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ఆధ్వర్యంలోజరిగిన ఈ కార్యక్రమంలో నాట్స్ డాలస్ విభాగం నాయకులు స్థానిక తెలుగువారికి ఈ వ్యాక్సిన్ డ్రైవ్ పట్ల అవగాహనకల్పించి ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా చేశారు.

Telugu Dallas, Pharmacy, Knotsboard, Knotsvaccine, Texas-Telugu NRI

నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్ కిషోర్వీరగంధం, ఆది గెల్లి, కిషోర్ కంచర్ల, ప్రేమ్ కుమార్ లతో పాటు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ భాను లంక, చాప్టర్ కోఆర్డినేటర్స్రాజేంద్ర కాట్రగడ్డ, రాజేంద్ర యనమల తదితర స్థానిక డాలస్ నాట్స్ విభాగ నాయకులంతా ఈ కార్యక్రమం దిగ్విజయంచేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.వ్యాక్సిన్ వేయించుకున్న వారంతా నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలపైప్రశంసల వర్షం కురిపించారు.నాట్స్ తెలుగువారి పట్ల బాధ్యతతో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిందని అభినందించారు.నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని టెక్సాస్ చాప్టర్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ పలు ఇతర చాఫ్టర్స్ కూడాఇదేవిధమైన స్ఫూర్తి తో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube