మనలో చాలామంది జంతువులను అమితంగా అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.జంతువులకు ఏ చిన్న అపాయం కలిగినా చాలామంది తట్టుకోలేరు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొన్ని రోజుల క్రితం ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే.పునీత్ రాజ్ కుమార్ కు కుక్కలంటే ఎంతో ఇష్టం కాగా పునీత్ కుక్కలను ప్రేమతో పెంచుకున్నారు.
గతంలో పునీత్ కుక్కలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం లక్షాలది మంది అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.
పునీత్ రాజ్ కుమార్ కనిపించకపోవడంతో ఆయన పెంచుకుంటున్న పెంపుడు కుక్కలు సైతం కన్నీటి పర్యంతమయ్యాయి.పునీత్ ఫోటో దగ్గరకు వెళ్లి పెంపుడు కుక్కలు ధీనంగా ఏడుస్తున్నాయి.కుక్కలు ఈ విధంగా చేయడంతో పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
పునీత్ మరణం వల్ల పెంపుడు కుక్కలు ఆహారాన్ని కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కుక్కలను సమాధి దగ్గరకు తీసుకెళ్లారు.బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఆయన పెంపుడు కుక్క కూడా కొన్నిరోజుల పాటు ఆహారం తీసుకోలేదనే సంగతి తెలిసిందే.పునీత్ రాజ్ కుమార్ పెంపుడు కుక్కలు సాధారణ స్థితికి చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మూగజీవాలు మనుషులపై ఎంతో ప్రేమను చూపిస్తాయనే విషయం తెలిసిందే.మరోవైపు పునీత్ మరణ వార్తను నమ్మలేకపోతున్నామని ఆయన జీవించి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.పునీత్ మరణించినా ఆయన సేవా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని సమాచారం.
పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ త్వరలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.