కోమా నుండి బయటకు వచ్చి వైద్యులకే షాకిస్తున్న మహిళ!

ఆ మహిళ యాక్సిడెంట్ అవ్వడం వల్ల తీవ్రంగా గాయపడింది.దీంతో ఆ ప్రమాదం వల్ల కోమా లోకి వెళ్ళిపోయింది.

 Women Lose Their Own Language After Treatment From Coma Details, Language,usa,wo-TeluguStop.com

ఆమెను కోమా నుండి బయటకు తీసుకు వచ్చేందుకు వైద్యులు చాలా ప్రయత్నాలు చేసారు.చివరకు ఆమె కోమా నుండి బయటకు వచ్చింది.

అయితే అక్కడ అసలు సమస్య మొదలయ్యింది.ఆమె వైద్యులకే పిచ్చేక్కించింది.

ఇంతకీ ఆమెకు ఏం జరిగిందో తెలుసు కోవాలి అని అనుకుంటున్నారా.అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.ఆమె పేరు సామర్ డియాజ్.ఆమెకు 24 సంవత్సరాలు.

అయితే కొన్ని రోజుల క్రితం ఆమెకు యాక్సిండెంట్ అయ్యింది.ఆ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆమె కోమా లోకి వెళ్లి పోయింది.

ఆమెను కోమా నుండి బయటకు తీసుకు రావడానికి వైద్యులు చాలా ప్రయత్నాలు చేసారు.

ఇక ఎట్టకేలకు వైద్యులు ఆమెను రెండు వారాల తర్వాత కోమా నుండి బయట పడేలా చేసారు.

Telugu Koma, Language, Zealandtribal, Samar Diaz-Latest News - Telugu

అయితే మాములుగా కోమా లోకి వెళ్లిన వారు గతం మర్చిపోతారు.మరికొంత మంది మాట కూడా మర్చిపోతారు.అలాంటి వారికీ కొన్ని థెరపీల ద్వారా గతం గుర్తుకు వచ్చేలా డాక్టర్లు చేస్తారు.అయితే ఈమె విషయంలో మాత్రం వైద్యులు ఊహించనిది జరిగింది.

Telugu Koma, Language, Zealandtribal, Samar Diaz-Latest News - Telugu

కోమా నుండి బయటకు వచ్చిన సామర్ కు కూడా థెరపీ చేసారు.అయితే అవేమి ఆమెకు పనిచేయక పోవడంతో ఆమె కోలుకున్నాక కొత్త భాష మాట్లాడడం మొదలు పెట్టింది.ఆమె న్యూజిలాండ్ లోని ట్రైబల్ భాష మాట్లాడుతుందని ఎట్టకేలకు గుర్తించారు.అయితే ఇప్పటి వరకు ఆమె అసలు న్యూజిల్యాండ్ నే వెళ్లలేదట.అందుకే ఆమె ఆ భాష మాట్లాడడంతో అందరు షాక్ అవుతున్నారట.వైద్య భాషలో దీనిని ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు.

అయితే ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube