మనుషులు రోజు రోజుకూ చాలా దారుణంగా తయారవుతున్నారు.కనీసం మానవత్వాన్ని మర్చిపోయి రాక్షసానందాన్ని పొందుతున్నారు.
ఇన్ని రోజులు కేవలం మనుషుల మీద మాత్రమే ఇలాంటి రాక్షసత్వాన్ని ప్రదర్శించిన క్రూరులు ఇప్పుడు మూగ జంతువుల మీద పడ్డారు.వారి అరాచకాలకు పాపం మూగ జీవులు బలైపోతున్నాయి.
అయితే ప్రతిసారి వారు పై చేయి సాధించలేరు కదా.అందుకే ఈ సారి కూడా ఇలాగే చేయబోతో ఓ ఆవు తగిన గుణపాఠం చెప్పింది.
మనుషులకు మానవత్వం లేకపోయినా వాటికి ఉందంటూ చెప్పుకొచ్చింది.
కొన్ని సార్లు జంతువులకు కూడా స్నేహం అనే మాట వర్తిస్తుందేమో అనిపిస్తుంది.
ఎందుకంటే వాటి స్నేహితులను ఏమైనా అంటే చాలు అవి వెంటనే రంగంలోకి దిగిపోతాయి.ప్రత్యర్థులకు చుక్కలు చూపించేదాకా వదిలి పెట్టవు.ఇప్పుడు కూడా ఇలాంటి స్నేహాన్ని చాటు వీడియో గురించే మీ ముందుకు తీసుకొస్తున్నాం.ఇందులో చూస్తే ఓ వ్యక్తి మానవత్వం మర్చిపోయి మూగ జీవి అయిన కుక్క మీద అమానుషంగా దాడి చేశాడు.
దాని చెవులు పట్టుకుని పైకి లేపుతూ దాన్ని భాదించాడు.ఈ బాధకు ఆ కుక్క నొప్పితో విలవిలలాడిపోయింది.
విచిత్రం ఏంటంటే అక్కడున్న వారు అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ దాన్నంతా కూడా వీడియో తీస్తూ రాక్షసానందం పొందుతున్నారు.మరి మనుషులకు మానవత్వం లేకపోతే మూగ జంతువులకు ఉండదా.దీన్ని ఓ ఆవు నిరూపించింది.ఎక్కడి నుంచి వచ్చిందో గానీ వస్తూ ఆ వ్యక్తి పై దాడి చేసి కుక్కను వదిలిపెట్టేలా చేసింది.ఇక అతన్ని తన కొమ్ములతో కింద పడేసి బాగా కుమ్మి పడేసింది.దీన్ని కూడా అక్కడున్న వారు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు.
ఇంకేముంది దీన్ని చూసిన వారంతా కూడా ఇదే కర్మ అంటూ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.