ఈ పాప చేస్తున్న ప‌ని చూస్తే మీ చిన్న‌ప్ప‌టి విష‌యాలు గుర్తొస్తాయి..

వ‌ర్షం అంటే ఓ చెప్ప‌లేని అనుభూతి.ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌రాల్లో ఇది చాలా ముఖ్య‌మైన‌ది.

 If You Look At What This Girl Is Doing You Will Remember Your Little Things., Ra-TeluguStop.com

మాన‌వ, సృష్టి మ‌నుగ‌డ‌క వ‌ర్షాలు ఎంత ముఖ్య‌మో తెలిసిందే.కానీ వ‌ర్షం వ‌చ్చింద‌టే చాలు చిన్న పిల్ల‌లు ఎంత‌లా ఎంజాయ్ చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఎందుకంటే ఈ వ‌ర్షంలో ఆడుకుంటే వ‌చ్చే ఎంజాయ్ మెంట్ వేరే లెవ‌ల్ క‌దా.అందుకే వ‌ర్షానికి అంత‌లా ఫ్యాన్స్ ఉంటారు మ‌రి.

వర్షాన్ని ఇష్టపడని వారు ఎవ‌రైనా ఉంటారా చెప్పండి.చిన్న పిల్ల‌ల‌కు వ‌ర్షం వ‌చ్చింద‌టే చాలు పెద్ద పండ‌గే అనిపిస్తుంది.

అంతెందుకు చిన్న ప్పుడు మ‌నం కూడా ఇంతే.

మ‌నం చిన్న‌గా ఉన్న‌ప్పుడు అయితే వ‌ర్షంలో ఆడుకోవ‌డం అంటే ఎంత స‌ర‌దానో క‌దా.

ఈ స‌ర‌దానే మ‌ల్ని కొన్ని సార్లు తిట్లు ప‌డేలా చేస్తుంది.మ‌రి కొన్ని సార్లు దెబ్బ‌లు ప‌డేలా కూడా చేస్తుంద‌నుకోండి.

అయినా స‌రే వ‌ర్షంలో ఆడుకుంటే ఆ మ‌జానే సెప‌రేటు.ఇంకాచెప్పాలంటే బుర‌ద‌లో ఆడుకుంటంటే వ‌చ్చే సంబురం అంతా ఇంతా కాదు.

అయితే ఆ చిన్న నాటి గుర్తుల‌ను కొన్ని సార్లు మ‌నం మ‌ర్చిపోతుంటాం క‌దా.ఎందుకంటే మ‌న బిజీ లైఫ్ లో అవ‌న్నీ గుర్తుంటాయా.

అయితే ఇప్పుడు మీకంద‌రికీ గుర్తు చేసే ప్ర‌య‌త్నం ఈ చిన్నారి చేసింది.

ప్ర‌స్తుత‌తం విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి జోరుగా వర్షం పడుతుండగా రోడ్డు మీద‌కు వ‌చ్చేసింది.ఇలా వ‌స్తూనే ఆ వీధిలో రోడ్డుపై ఉన్న బుర‌ద‌లో వ‌ర్షంలోనే ఆడుకుంటుంది.అందులో కూర్చుంటూ లేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది.

ఆ దారిన వెళ్తున్న వారు ఎవ‌రి పని వారు చేసుకుంటున్నారు.ఆ చిన్నారి మాత్రం ఎవ‌రినీ ప‌ట్టించుకోకుండా ఎంచ‌క్కా ఆ బుర‌ద‌లో ఆడుకోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

ప‌ట్ట‌రాని ఆనందంతో పాప వేస్తున్న గంతులు చూస్తే మాత్రం ఎవ్వ‌రికైనా త‌మ‌చిన్న‌త‌నం గుర్తుకు రావాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube