చిన్నికృష్ణ ఆనందాన్ని ఇచ్చే సినిమా ఇంద్ర అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన బారీ అంచనాల సినిమా.సినిమా అన్నాక తప్పులు ఉండడం కొంతవరకు సహజమే అలాగే ఇంద్ర సినిమాలో కూడా ఒక తప్పు జరిగింది.
ఒక సీన్లో బయటేమో హోలీ పండుగ చేసుకుంటుంటే చిరంజీవి గారికి రాఖీ కడుతూ ఉంటారు.ఈ సీన్ మిస్టేక్ జరిగిందని అప్పట్లో చిత్ర బృందం సైతం ఒప్పుకొంది ఆ తర్వాత దాన్ని సరి చేశారు కూడా.
ఇదిలా ఉండగా ఇంద్ర సినిమాలో కాశీ హైలెట్ గా నిలుస్తుందని ఇప్పటికీ అభిమానం చెప్పుకుంటారు.ఆ సన్నివేశంలో లో హీరోయిన్ సోనాలి బింద్రే చేసిన నటన అందరికీ నేటికీ గుర్తుంటుంది.
ఇకపోతే సోనాలి బింద్రే షూటింగ్ కి వచ్చిన ఫస్ట్ రోజే ఒక పేచీ పెట్టిందని డైరెక్టర్ గోపాల్ తెలిపారు.అది ఏంటంటే గంగలో మునిగి మునగడం తనవల్ల కాదు అని తనకు చాలా భయం అని చెప్పినట్టు ఆయన తెలిపారు.
నా ప్రాణం పోతుంది అది ఏదో జరుగుతుంది మళ్ళీ పైకి రాలేనేమో అని అనిపిస్తుంది అని సోనాలి బింద్రే తనకు చెప్పినట్టు గోపాల్ వివరించారు.

దానికి అది చాలా ఇంపార్టెంట్ సీన్ చేయకపోతే ఎలా అమ్మ అని అంటే లేదు సార్ చేయడం తనవల్ల కాదు అని చెప్పినట్లు ఆయన అన్నారు.నిజానికి అక్కడ సీన్ ప్రకారం గంగలో నాలుగు ఐదు సార్లు మునగడం అనేది కంపల్సరీ.లేకపోతే ఈ సీన్ ఈ సినిమాలో ఉండదు.
కాబట్టి ఇది చేయడం చాలా కచ్చితంగా అని ఆయన చెప్పినట్టు తెలిపారు.

అయితే చివరగా తనకు ఓ ఐడియా వచ్చిందని ఆయన ఇలా వివరించారు.ఇక్కడ మూడు కెమెరాలు ఉన్నాయి నువ్వు గంగలో ఒక సారి మునుగు భయమనకో ఏమైనా అనుకో ఇది చేయడం చాలా ముఖ్యం ఆయన చెప్పినట్టు తెలిపారు.లేదంటే షూటింగ్ ఆపేస్తాం అని ఊరికే బెదిరించినట్టు నవ్వుతూ చెప్పారు.
అలా ఆ సీన్ సోనాలి బింద్రేతో బలవంతంగా ఆ సన్నివేశాన్ని చేయించినట్లు ఆయన చెప్పారు.