కరోనా కారణంగా ఇటీవల రద్దైన భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన 5 వ టెస్ట్ మ్యాచ్ పై క్లారిటీ వచ్చేసింది.దీని పై ఇరు బోర్డులు ఏకాభిప్రాయానికి వచ్చి జులై 1, 2022 న నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.
కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను ఎంత అతలాకుతలం చేసిందో మనందరికీ తెలిసిందే.కరోనా ను జయించేందుకు లోక్డౌన్ పాటిస్తూ ఎన్నో పనులు, ప్రాజెక్టులు వాయిదా పడ్డాయి.
అలాగే క్రికెట్ ప్రపంచంలో ఎంతోమందికి ఉపాధిని, ఎంటర్టైన్మెంట్ ను అందించే క్రికెట్ ను కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కరోనా కారణంగా టీమిండియా శిబిరంలో కేసులు ఎక్కవైన నేపథ్యంలో భారత్- ఇంగ్లాండ్ ల బోర్డులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇందులో భాగంగా ఇటీవల జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదవ టెస్టును తాత్కాలితంగా రద్దు చేయడం అందరికి తెలిసిందే.

అయితే మళ్ళీ కరోనా తగ్గుతున్న నేపథ్యంలో మళ్ళీ క్రికెట్ మ్యాచ్ లను పునః ప్రారంభించింది.దీంతో భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదవ టెస్ట్ సిరీస్ పై బీసీసీఐ, ఈసీబీ విస్తృతంగా చర్చలు నిర్వహించారు.సిరీస్ లో విజేతలను తేల్చేందుకు ఐదో టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించాయి.
దీనికి సంబంధించి ప్రకటన కూడా విడుదల చేశారు.ఇక వచ్చే ఏడాది భారత్- ఇంగ్లాండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ లను నిర్వహించబోతున్నారు.
అదే సమయంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదవ టెస్ట్ సిరీస్ మ్యాచ్ కూడా జరగనుంది.దీంతో క్రికెట్ అభిమానులు ఆనందంతో మునిగి తేలుతున్నారు.