బీజేపీ తీరు హుజూరాబాద్‌లో అలా.. బ‌ద్వేల్‌లో ఇలా..

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.అయితే ఈ రెండు కూడా చాలా విభిన్నంగా జ‌రుగుతున్నాయి.

 Bjp's Style Is Like That In Huzurabad  Like In Badwell  Bjp, Huzurabad,latest Ne-TeluguStop.com

ఇటు తెలంగాణ‌లో జ‌రుగుతున్న‌వి ఏమో చాలా వాడీ వేఢిగా జ‌రుగుతున్నాయి.నువ్వా నేనా అన్న‌ట్టు ఇంకా చెప్పాలంటే ఈ ఎన్నిక‌ల‌ను రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రిహార్స‌ల్ లాగా ఫీల‌వుతున్నాయి అన్ని పార్టీలు.

మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌ధాన అభ్య‌ర్థిగా పోటీలో ఉన్నారు.ఇక్క‌డ బీజేపీ ఎలాగైనా గెలుస్తామ‌నే ధీమాను క‌న‌బ‌రుస్తోంది.

అన్ని పార్టీల చూపు ఈట‌ల రాజేంద‌ర్ వైపే ఉంది.అంతెందుకు దేశ వ్యాప్తంగా ఈ ఎన్నిక‌ల‌కు క్రేజ్ ఉంది.ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఆయ‌న్ను ఓడించేందుకు కేసీఆర్ ఏకంగా ద‌ళిత‌బంధు లాంటి స్కీమ్‌ను కూడా పెట్టారంటేనే దీన్ని ఎంత సీరియ‌స్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఇక్క‌డ బీజేపీ ఇంత పాపులారిటీగా ఉంటే ఏపీలో మాత్రం ప‌రిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి.అక్క‌డ జ‌రుగుత‌న్న బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రిస్థితి ఏంటో అంద‌రికీ తెలిసిందే .

Telugu Ap, Badvel, Eetala, Huzurabad, Tg-Telugu Political News

ఒకే స‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌స్తున్న ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రిస్థితులు ఇలా ఉన్నాయి.హుజూరాబాద్ లో ఎలాగైనా గెల‌వాల‌ని కేంద్ర బీజేపీ పెద్ద‌లు దీనికి అన్ని విధాలుగా స‌పోర్టు చేస్తున్నారు.సెంట్ర‌ల్ లెవ‌ల్లో ఉన్న స్టార్ క్యాంపైనర్లు కూడా ఈ ఎన్నిక‌కు వ‌స్తున్నారు.కానీ బద్వేల్ ఉప ఎన్నిక‌కు మాత్రం క‌నీసం ప్రచారానికి కూడా రాష్ట్ర స్థాయి నేతలు పూర్తిగా వెళ్ల‌లేని పరిస్థితి ఉంది.

హుజూరాబాద్ లో ఈట‌ల రాజేంద‌ర్ బ‌ల‌మైన క్యాండిడేట్‌గా బ‌రిలోకి దిగుతుండ‌టంతో ఆయ‌న‌కు ఇంత‌లా అండ‌గా నిలుస్తున్న బీజ‌పీ బ‌ద్వేల్‌కు మాత్రం దూరంగా ఉంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube