ఐపిఎల్ వస్తే చాలు చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు.అలాంటి ఐపిఎల్ లో ఆడాలంటే చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
అందులో కొందరికే అవకాశం దక్కుతుంది.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొందరు ఆటగాళ్లు ఐపిఎల్ కు దూరంగా ఉండాలనుకుంటున్నారు.
తాజాగా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడే క్రిస్ గేల్ మిగిలిన మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపాడు.చాలా రోజులుగా బయో బబుల్ లో ఉండటం వల్ల గేల్ మానసికంగా అలసిపోయానని తెలిపాడు.
అందుకే తనకు విరామం అనేది చాలా అవసరం అని, ఆ విరామం తీసుకోవడానికి ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు గేల్ ప్రకటించాడు.గేల్ స్పష్టం చేసిన ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది.
‘పంజాబ్ కింగ్స్ గేల్ ను గౌరవిస్తోందని., గేల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని యాజమాన్యం తెలిపింది.
రాబోయేటటువంటి టీ20 వరల్డ్ కప్ ఫార్మేట్లలో కూడా గేల్ మంచి ప్రతిభను చూపాలని యాజమాన్యం కోరుతున్నట్లుగా ట్వీట్ చేసింది.
కరోనా వల్ల ఐపిఎల్ పటిష్టంగా నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా బయో బబుల్ లో చాలా రోజుల పాటు గేల్ ఉన్నాడు.దీంతో మానసికంగా అలసిపోయినట్లు గేల్ పేర్కొన్నాడు.టి20 ప్రపంచకప్ లో కొత్త ఉత్సాహంతో ఆడతానని తెలిపాడు.కొన్ని రోజుల పాటు విరామం తీసుకుని బరిలోకి దిగుతానని తెలిపాడు.
కొన్ని నెలలుగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ బబుల్ ఆడానని, ఆ తర్వాత ఐపీఎల్ బబుల్ లో ఉంటున్నానని గేల్ తెలిపాడు.
ఇలా కుటుంబానికి దూరంగా ఉంటూ, అందరికీ దూరంగా ఉంటూ మానసికంగా ఇబ్బంది పడ్డానని తెలిపాడు.మానసిక పునరుత్తేజాన్నిపొందేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.క్రీడాకారులకు కరోనా సోకకుండా ఉండాలనే ఉద్దేశంతో బయోబబుల్ విధానాన్ని తీసుకొచ్చారు.
బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇందులో ఉండాలి.ఏడు రోజులు క్వారంటైన్ లో ఉన్నవారు ఈ బయోబబుల్ లోకి ప్రవేశిస్తారు.
కరోనా నెగెటివ్ అని తేలితేనే వారిని బయోబబుల్ లోనికి వెళ్లనిస్తారు.