బుల్లితెరపై ఇప్పటికీ తెలుగు అభిమానులను అలరిస్తున్న పాపులర్ షో జబర్దస్త్.ఈ ప్రోగ్రామ్ ఎంతో మందికి మంచి లైఫ్ ని, మంచి పేరు, హోదాని ఇచ్చింది.అందులో ఒకరు అప్పారావు.తన స్కిట్ లతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ, ప్రస్తుతం ప్రముఖ హీరోలతోనూ సినిమాల్లో నటిస్తూ తన నటనను నిరూపించుకుంటున్నారు.
ఇప్పటివరకు దాదాపుగా 40 మంది హీరోలతో కలిసి పని చేశానని అప్పారావు తెలిపారు.కాగా, హీరో ప్రభాస్ తో జరిగిన సంఘటనను ఆయన ఒకసారి నెమరు వేసుకుంటూ… చక్రం సినిమా షూటింగ్లో భాగంగా ప్రభాస్ అక్కడ ఉన్నారని, ఆయనతో జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ ని ఆయన పంచుకుంటూ… ప్రభాస్ ఇంగ్లిష్ లో మాట్లాడితే, నేను తెలుగులో మాట్లాడాను.అలాగే తెలుగులో మాట్లాడితే, తెలుగులో, ఆ తర్వాత హిందీలో మాట్లాడితే ప్రభాస్ నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారని అప్పారావు తెలిపారు.
“మరొకసారి మేము లయ సీరియల్ షూటింగ్ లో ఉన్నపుడు, అక్కడే ప్రభాస్ ఉన్నారని తెలిసి ఆయన్ని కలవడానికి వెళ్ళాను.
వెళ్లి నమస్తే బాబు.అని నేను అన్నాను.ఆయన వెంటనే లేచి నిలబడి, ప్రొడక్షన్ వారిని పిలిచి కుర్చీ తెప్పించారు.నేను కూర్చున్నాకే ఆయన కూర్చున్నారు.ఇది ప్రభాస్ కున్న సంస్కారం.నిజానికి అతనికి అలా చేయడం అవసరం లేదు కదా.” అని అప్పారావు, ప్రభాస్ ను మెచ్చుకున్నారు.
ఇప్పటివరకు చాలా మంది అగ్ర హీరోలతో నటించానన్న ఆయన, ప్రభాస్ తో మాత్రం నటించే ఛాన్స్ రాలేదని ఆయన అన్నారు.ఒకసారి బిల్లా మూవీకి ఛాన్స్ వచ్చినా కుదరక ఆ సినిమా చేయలేక పోయానని ఆయన వాపోయారు.ఎప్పటికైనా తనతో కలిసి సినిమాలో నటించాలని ఆశ అతనికి ఉందని తన కోరిక తొందర్లోనే నెరవేరాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా అప్పారావు వెల్లడించారు.