నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టకుండా ఉంటానా అనే సామెత మీరు వినే ఉంటారు.చీమలు అవి పెట్టుకున్న పుట్టలోకి మనం వేలు పెడితే కుట్టిపెడతాయి కదా సరిగ్గా అలాగే ఒక కాకి కూడా తన స్థావరంలోకి వచ్చిన ఒక డ్రోన్ ను మరేదో పక్షి అనుకుని ఒక ఆట ఆడేసుకుంది.
ఈ విచిత్రమైన ఘటన ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా తన ఏరియాలో చోటు చేసుకుంది.అసలు వివరాల్లోకి వెళితే.
ప్రస్తుతం వివిధ దేశాలలో డ్రోన్ సేవలు బాగా అందుబాటులోకి వచ్చాయి.ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో కూడా ఈ డ్రోన్ సేవలు బాగా విరివిగా ఉపయోగిస్తున్నారు.
కాగా కాన్‌బెర్రాకు చెందిన బెన్ రాబర్ట్స్ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ లో కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశాడు ఒక వ్యక్తి.ఈ నేపథ్యంలో రెస్టారెంట్ సిబ్బంది ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీని చక్కగా ప్యాక్ చేసి ఒక డ్రోన్ సహాయంతో ఆర్డర్ చేసిన వ్యక్తి గల ప్లేస్ లోకిపంపించారు.
అయితే ఆ డ్రోన్ ను చుసిన ఒక కాకి ఆగ్రహంతో ఉగిపోయింది.ఆ డ్రోన్ ను చూసిన కాకి దానిని ఏదో పక్షి లాగా భావించింది.ఎంత దైర్యం నీకు నా ఏరియాలోకే వస్తావా ఉండు నీ పని చెప్తా అని ఆ డ్రోన్‌పై దాడి చేసింది.ఆ డ్రోన్ ను ముందుకు కదలకుండా కాకి తన ముక్కుతో డ్రోన్ ను గట్టిగా పట్టుకుంది.

ఇంకేముంది డ్రోన్ అలానే ఆగిపోయింది.కొద్ది సేపటి వరకు కాకి ఆ డ్రోన్ వెంటపడి దానితో ఒక ఆట ఆడేసుకుంది.చూడడానికి డ్రోన్ ఒక పక్షి మాదిరిగానే ఉండడంతో కాకి దానిని చూసి ఏదో పక్షి అనుకుని భ్రమపడి దాని మీద దాడి చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
చూసిన నెటిజన్లు కూడా భలే ఫన్నీగా ఉందని నవ్వుకుంటున్నారు.అసలు ఇంతకీ రెస్టారెంట్ వాళ్ళు డ్రోన్ సహాయంతో పంపిన కోల్డ్ కాఫీ అతన్ని చేరిందో లేదో అనే వివరాలు తెలియలేదు.