వంశీ చాగంటి. ఈ పేరు వింటే మీకు పెద్దగా ఎవరు గుర్తుకు రారు.
కానీ తెలుగులో ప్రముఖ దర్శకుడు “శేఖర్ కమ్ముల” దర్శకత్వం వహించిన “హ్యాపీ డేస్” చిత్రంలో రాజేష్ అంటే మత్రం టక్కున గుర్తు పడతారు.అయితే హ్యాపీ డేస్ చిత్రంలో నటించిన తర్వాత వంశీ చాగంటి సినిమాలపై పెద్దగా దృష్టి సారించ లేకపోయాడు.
ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఇతర దేశాలలో ఉద్యోగాలు చేసి మళ్ళీ ఇటీవలే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గద్దల కొండ గణేష్” చిత్రంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్రలో నటించి బాగానే అలరించాడు.కాగా వంశీ చాగంటి ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా ముఖ్యంగా తాను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో అయిన “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” కి చాలా పెద్ద అభిమానినని తెలియజేశాడు.అంతేకాకుండా తను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో “జానీ” చిత్రం విడుదల అయిందని అయితే ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం చాలా బాగా నచ్చిందని అందువల్లనే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా మారిపోయానని తెలిపాడు.
తేకాక అంతనకి పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో నటించాలని ఉందని ఆ అవకాశం వస్తే ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే ఖచ్చితంగా నటిస్తానని తన మనసులో మాటని బయట పెట్టాడు.అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ మరియు రానా మల్టీ స్టారర్ గా నటిస్తున్న “భీమ్లా నాయక్” చిత్రంలో కూడా తనకు నటించే అవకాశం వచ్చిందని కానీ తను ప్రస్తుతం ఇతర చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండడం అలాగే తన లుక్కు భీమ్లా నాయక్ చిత్రంలోని పాత్రకి సూటవ్వకపోవడంతో తానే సున్నితంగా నో చెప్పినట్లు తెలిపాడు.
ఇక తాను ఎంపిక చేసుకునే చిత్ర కథల విషయం గురించి స్పందిస్తూ తనకు రెమ్యూనరేషన్ ఇంపార్టెంట్ కాదని తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు.అలాగే భీమ్లా నాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ సాగర్ కే చంద్ర తనకు మంచి స్నేహితుడని అందువల్లనే తనకు భీమ్లా నాయక్ చిత్రంలో నటించే అవకాశాన్ని ఆఫర్ చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నో చెప్పినట్లు తెలిపాడు.