తెలుగు సినిమా ఇండస్ట్రీపెద్దగా.ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటన,డాన్సులతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి ఈ తరం హీరోలకు ధీటుగా సినిమాలను చేయడమేకాకుండా తన అద్భుతమైన స్టెప్పులతో నేటి హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.చిరంజీవి సినిమాల్లో చేసే డాన్స్ లకు ఎంతో మంది అభిమానులున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలా తన నటనతో డాన్సులతో ఎంతోమందిని ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా లవ్ స్టోరీ ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సాయి పల్లవితో కలిసి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి ఒక ఆంటీతో కలిసి వేసిన స్టెప్పులు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.మెగాస్టార్ చిరంజీవి కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే కలిసిన ఈ పార్టీలో తన సన్నిహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ పార్టీలో భాగంగా మెగాస్టార్ ఎంతో సంతోషంగా చిందులు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ పార్టీలో భాగంగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఉన్నటువంటి ఒక ఆమెతో మెగాస్టార్ ఎంతో అద్భుతమైన స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.చిరు వేస్తున్న స్టెప్పులు చేస్తుంటే ఆయన ఎనర్జీ, డాన్స్ వేసేరీతిలో అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం మార్పు రాలేదని చెప్పవచ్చు.వయసు పైబడుతున్న కొద్దీ మెగాస్టార్ రెట్టింపు ఉత్సాహంతో చిందులు వేయడమే కాకుండా వరుస సినిమాలను దక్కించుకుంటూ నేటి హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.