ఈనెల 20న సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ.చిరంజీవి నేతృత్వంలో సినీ సమస్యలపై చర్చ.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో సినీ ప్రముఖులు భేటీకి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు సినీ ప్రముఖులు సమావేశంలో పాల్గొంటున్నారా లేదన్న విషయం తెలియాల్సి ఉంది.
ఆన్ లైన్ టిక్కెట్ లపై చర్చ ప్రముఖ సినీ నటులు చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.
కోవిడ్ నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు మూసేశారు.సినిమా నిర్మాణం కూడా ఆగింది.
తదనంతరం కోవిడ్ సడలింపులతో సినిమా షూటింగులు మొదలైనప్పటికీ అతకు ముందు ఉన్నంతగా భారీగా లేవు.కొత్త సినిమాలు లేకపోవడం కోవిడ్ ఆంక్షలు విధించగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం గా చెప్పడంతో ఏపీ లోను థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఈ కాలంలోనే గతేడాది చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు.వీరి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి థియేటర్ల విద్యుత్ చార్జీలు బకాయిలను మూడు నెలలకు రద్దు చేయడంతోపాటు మిగిలిన బకాయిలు వాయిదాల్లో చెల్లించుదుకు అనుమతించారు.

ఇది ఇలా ఉన్న తరుణంలోనే కోవిడ్ రెండోదశ ఉద్ధృతి మరోసారి సినీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.ఆంక్షలు సడలించిన తర్వాత కూడా థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.పైగా ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు పెంపు పై ఆంక్షలు విధించడంతో మల్టీప్లెక్స్ లు ఏ కేంద్రాల్లోనూ కొన్ని థియేటర్ మినహా చాలా వరకు ధియేటర్లు తెరుచుకోలేదు.వీటన్నింటిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిచి వివరించేందుకు సినిమా ప్రముఖులు పలుమార్లు నిర్ణయించుకున్నప్పటికీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

సినిమా పరిశ్రమ ప్రముఖులతో మంత్రి పేర్ని నాని సమావేశం.
నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో తెలుగు సినీ పరిశ్రమ పెద్దల తో ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు.సమావేశంలో సినీ నిర్మాతలు ప్రదర్శనకారులు, పంపిణీదారులు పాల్గొన్నారు.ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వల్ల సినీ పరిశ్రమ కు ఎదురైన ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఆన్ లైన్ టికెట్ లోనై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.రేపటి సమావేశంలో ఆన్ లైన్ సినిమా టికెట్ అంశంపై కొంథ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.