వివాహేతర సంబంధాలు పచ్చటి కుటుంబాలలో, సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.ఇటీవల కాలంలో ఈ కేసులు ఎక్కువవుతున్నాయి.
ఈ క్రమంలోనే హత్యలు కూడా జరుగుతున్నాయి.కుటుంబాలలో కలతలు రేగి పిల్లలు రోడ్డున పడుతున్నారు.
తాజాగా ఓ దారణ ఘటన తమిళనాడులో జరిగింది.ఓ వివాహితతో ఇద్దరు యువకులు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.
వివాహేతర సంబంధం నైతికంగా తప్పు అని తెలిసినప్పటికీ చాలా మంది అలా చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అయితే, వివాహేతర సంబంధం చివరకు విషాదం నింపుతుందని చెప్తున్నారు.
ఘటన వివరాల్లోకెళితే.తమిళనాడులోని సేలం జిల్లా అయోధ్య పట్టణం రామ్నగర్ కాలనీకి చెందిన మురుగేశన్ రెండో భార్య కలైమణి.
అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్, కృపై రాజ్(23)తో ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఈ క్రమంలోనే సదరు వివాహిత గర్భం దాల్చింది.
ఈ విషయం ఇద్దరు ప్రియులకు తెలియడంతో వారు గొడవపడ్డారు.కలైమణి కడుపులోని బిడ్డకు తానంటే తాను తండ్రిని అని వారు వాదించుకున్నారు.
ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ బాగా పెరిగింది.కోపంలో కలైఅరసన్ కత్తితో కృపైరాజ్పై దాడి చేసి హత్య చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కలైమణి, కలై అరసన్ను అరెస్టు చేశారు.స్థానికంగా ఈ ఘటనపై చర్చ జరుగుతున్నది.నైతికతను వదిలేసి సదరు వివాహిత, యువకులు ప్రవర్తించారని అనుకుంటున్నారు.నమ్మకం, ప్రేమ అనేవి తెలియకుండానే వారు ఇలా చేశారని ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైందని పేర్కొంటున్నారు.ఇకపోతే ఇటువంటి ఘటనలు పెరగడానికి కారణం జనాల్లో నైతికత లోపించడమేనని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతీ ఒక్కరు విలువలు పెంచుకోవాలని, తద్వారా సొసైటీ బాగుంటుందని అంటున్నారు.