1.ప్రవాసీయుడికి ‘అభినయనంతర శ్రీ ‘ పురస్కారం
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 న భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు ను పురస్కరించుకుని కర్ణాటక సంఘ ఖతర్ వారు సామాజికంగా వృత్తి పరంగా భారతీయ సమాజానికి విశేష కృషి చేసినందుకు అభినయంత్ర శ్రీ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది.2021 సంవత్సరానికిగానూ తెలుగు ఇంజనీరింగ్ కృష్ణకుమార్ బంధ కవికి ఈ పురస్కారం దక్కింది.
2.కువైట్ లో 192 మంది ప్రవాసుల అరెస్ట్
గల్ఫ్ దేశం కువైట్ లో 192 మంది ప్రవాసీలు అరెస్టయ్యారు.రెసిడెన్సి ఉల్లంఘన దారులు, యజమానుల నుంచి తప్పించుకున్న వారే లక్ష్యంగా ప్రజా భద్రతా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్రా ఫర్రాజ్ అల్ జోబి పర్యవేక్షణలో అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది తాజాగా తనిఖీలు చేపట్టారు 192 మంది వలసదారులు ఈ తనిఖీల్లో చిక్కారు.
3.వలసదారులకు కువైట్ గుడ్ న్యూస్
ఆగస్టు ఒకటి నుంచి రెండు దోస్తుల వ్యాక్సిన్ తీసుకున్నాం వలసదారులకు తిరిగి వచ్చేందుకు కువైట్ అనుమతి ఇచ్చింది.విజిట్ వేషాల జారి కూడా ప్రారంభించింది.ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఆరోగ్య విద్యా రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రెండు సెక్టార్ లో పని చేస్తున్న వలసదారు ఉద్యోగులను తమ పై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను విజిట్ వీసాపై కువైట్ తీసుకువచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
4. మూడు వేల మంది హెల్త్ వర్కర్ ల సస్పెండ్
ఫ్రాన్స్ లో కరోనా టీకా తీసుకోనందుకు మూడు వేల మంది ఆరోగ్య కార్యకర్తలను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
5.జో బైడన్ తో నరేంద్ర మోదీ భేటీ
ప్రధాన నరేంద్ర మోడీ ఈ నెల 25న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ జనరల్ డిబేట్ నుద్దేశించి ప్రసంగించనున్నారు.అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడ సెప్టెంబర్ 24 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో చర్చల్లో పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
6.ముప్పై విమానాశ్రయల నిర్మాణానికి చైనా ప్రయత్నం
భారత్ పై చైనా తన కుయుక్తులను ఇంకా కొనసాగిస్తూనే ఉంది.భారత్ ను దెబ్బకొట్టేందుకు ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణానికి సిద్ధమైంది.
7.అమెరికా అధ్యక్షుడు పై పాక్ ప్రధాని ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ దేశాల అధినేతలతో మర్యాదపూర్వకంగా ఫోన్ లో ఆయన మాట్లాడారు.అందరితో పాటు తనకు కూడా బైడన్ నుంచి మర్యాదపూర్వకంగా ఫోన్ కాల్ వస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎదురుచూస్తున్నా, ఫోన్ కాల్ రాకపోవడం తీవ్ర అసంతృప్తి ,ఆగ్రహం వ్యక్తం చేశారు.
8.యెమెన్ లో 50 మంది రెబల్స్ హతం
ఉమెన్ లో జరిగిన సైనిక కాల్పులలో 50 మంది రెబెల్స్ మృతి చెందారు.
ఆవకాయలో సెంట్రల్ ప్రావిన్స్ లో ప్రభుత్వ దళాలు రెబెల్స్ మధ్య ఘర్షణ జరిగింది ఆ కాల్పుల్లో ఆఫీసర్ ఒకరు మృతి చెందారు.ఇక రెబల్ దళం లో 50 మంది వరకు మృతి చెందినట్లు మిలటరీ వర్గాలు వెల్లడించాయి.
9.అణు జలాంతర్గాములను అనుమతించం : న్యూజిలాండ్
అను జలాంతర్గాములను తమ ప్రాదేశిక జలాల్లోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని న్యూజిలాండ్ ప్రకటించింది.
10.చైనాలో వందకోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి
కరుణ వైరస్ ను పూర్తిగా అంతమొందించేందుకు చైనా చర్యలు ప్రారంభించింది.
ఇప్పటికే ఆ దేశ జనాభాలో 100 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పూర్తి అయ్యింది.