బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా, కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించు కోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
కంగనా రనౌత్ తన సినీ జీవితంలో ఇప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయి వంటి లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈమె తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమాలో నటించి మరోసారి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో ఇప్పటికే ఇంకా రెండు మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి మహాసాధ్వి సీత పాత్రలో కంగనా నటించబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అందుకు గల కారణం ఈమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వలేకనే నిర్మాతలు సీత పాత్రలో వేరొకరిని తీసుకుంటున్నారనే విషయాన్ని స్వయంగా కంగనా ఓ సందర్భంలో తెలియజేశారు.

ఇదిలా ఉండగా తాజాగా కంగనా రనౌత్ అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఎస్.ఎస్.స్టూడియోస్ కు చెందిన సలోని శర్మ నిర్మించబోతున్న ‘ది ఇన్ కారనేషన్ : సీత’ సినిమాలో సీత పాత్రలో నటించడం కోసం ఈమెను ఎంపిక చేసినట్లు అధికారిక ప్రకటన వెల్లడించారు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత అయినటువంటి విజయేంద్రప్రసాద్ కథను అందించనున్నారు.