టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గత ఏడాది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు.అయితే కరోనా వల్ల ఈ సినిమా ను ఇప్పట్లో విడుదల చేసేలా కనిపించడం లేదు.
మొన్నటి వరకు అక్టోబర్ లో సినిమా ఉంటుందని అన్నారు.కాని థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు కనుక విడుదల విషయంలో వెనక్కు తగ్గారు.
ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మేకర్స్ అధికారికంగా ప్రకటన చేసేందుకు భారీ ఎత్తున మీడియా సమావేశంను ఏర్పాటు చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా ట్విట్టర్ లో సింపుల్ గా ఒక ట్వీట్ తో గత కొన్ని వారాలుగా దేశం మొత్తం ఉన్న చర్చకు తెర దించారు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు అదుగో ఇదుగో అంటూ ఎదురు చూసిన సినిమా విడుదల ఇప్పట్లో లేదు అని తేలిపోయింది.
ట్విట్టర్ లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ అఫిషియల్ గా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు వచ్చింది.
అక్టోబర్ లో సినిమా విడుదల చేయాలంటే చేయవచ్చు.కాని దేశంలో పలు ప్రాంతాల్లో థియేటర్లు లేవు.
కనుక థియేటర్లు పూర్తి స్థాయిలో వచ్చే వరకు సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించారు.సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పట్లో ఒక క్లారిటీ ఇవ్వలేమని కూడా చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా అఫిషియల్ గా ప్రకటించారు.దాంతో దసరా కు బరిలో దిగాలనుకుంటున్న సినిమాలు వెంటనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.ఆర్ ఆర్ ఆర్ సినిమా పాన్ వరల్డ్ మూవీ కనుక ప్రపంచం మొత్తం కూడా థియేటర్లు యదా స్థితికి వచ్చినప్పుడు మాత్రమే విడుదల చేయడం మంచి నిర్ణయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.అందులో భాగంగానే సినిమా విడుదల నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.