ప్రజెంట్ వరల్డ్ టెక్నాలజికల్ వరల్డ్ అని ప్రతీ ఒక్కరికి తెలుసు.ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్లు, సాంకేతికత ఉపయోగిస్తూ ఆధునిక సమాజంలో బతుకుతున్నారు.
ఈ సమయంలో మూఢనమ్మకాలు అనేవి అస్సలు మన సొసైటీలో లేవు అని కొందరు అంటుండటం మనం చూడొచ్చు.కానీ, వారు అలా చెప్పినా ఇంకా మూఢనమ్మకాలు జనంలో బలంగా నాటుకుపోయి ఉన్నాయని చెప్పేందుకు ఇటీవల కాలంలో జరిగిన ఘటనలే ఉదాహరణ అని చెప్పొచ్చు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా టీఆర్‌నగర్‌లో ఓర్పు రమేశ్ అనే వ్యక్తి చనిపోగా, మంత్రాల నెపంతో చనిపోయాడాని పుల్లయ్య అనే వ్యక్తిని స్థానికులు చితకబాదారు.ఈ క్రమంలో దెబ్బలు తాళ లేక తానే మంత్రాలతో రమేశ్‌ను చంపానని, మంత్రాలతోనే మళ్లీ అతడిని బతికిస్తానని శవం దగ్గర పూజలు చేయడం స్టార్ట్ చేశాడు.
ఈ విషయమై పలువురు పోలీసులకు సమాచారమివ్వగా, వారు వచ్చి పుల్లయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం మృతుడి డెడ్‌బాడీని పోస్టుమార్టంకు తరలించారు.
తాజాగా ఇటువంటి ఘటన మరొకటి జరిగింది.మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో కరెంట్ షాక్‌తో చనిపోయిన ఓ కార్మికుడి మృతదేహాన్ని గంటలకొద్దీ బురదలోనే ఉంచారు గ్రామస్తులు.
చనిపోయిన వ్యక్తి బాడీని తడి నేలలో ఉంచితే, హ్యూమన్ బాడీ నుంచి పవర్ బయటకుపోయి బతికొస్తాడని స్థానిక గిరిజన తెగకు చెందిన ప్రజలు అంటున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అది మూఢ నమ్మకమని పేర్కొని, డెడ్ బాడీని బయటకు తీయాలని కోరినా స్థానికులు వినలేదు.ఈ విషయమై గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
చివరకు స్థానికులను ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.మృతుడు సల్మాన్ ఓ ఇంటి పైకప్పు సరి చేస్తుండగా, హైటెన్షన్ కేబుల్ తగిలి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయం పక్కనబెట్టి స్థానికులు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని మట్టిలో ఉంచడం మూఢ నమ్మకమేనని పోలీసులు పేర్కొంటున్నారు.