భారత్ నుండీ అమెరికా వెళ్లి స్థిరపడిన ఎన్నారైలు అక్కడ చక్కని ప్రతిభతో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు.తాము మాత్రమే కాకుండా తమ పిల్లలు సైతం అమెరికాలో గుర్తింపు పొందేలా తీర్చి దిద్దుతున్నారు.
ఈ క్రమంలోనే ముగ్గురు ఇండో అమెరికన్ విద్యార్ధులు తమ అత్యున్నత మైన ప్రతిభతో అమెరికా ప్రఖ్యాత ప్రెసిడెన్షియల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు.ప్రతీ ఏటా పర్యావరణ రక్షణలో భాగంగా సరికొత్త ఆలోచనలతో, వినూత్నమైన ఆవిష్కరణలు చేపట్టే విద్యార్ధులకు ప్రెసిడెంట్ ఎన్విరాన్మెంట్ యూత్ అవార్డ్ లను అందిస్తోంది అమెరికా ఎన్విరాన్మెంట్ ప్రొటక్షన్ ఏజెన్సీ.
ఈ అవార్డులను వరుసగా భారత సంతతికి చెందిన 3 విద్యార్ధులు గెలుచుకున్నారు.రీసైకిల్ మై బ్యాటరీ పేరుతో భారత సంతతికి చెందిన శ్రీ నిహాల్ ఆవిష్కరించిన ఈ ఆవిష్కరణకు నిర్వాహకులు ఫిదా అయ్యారు.
న్యూజెర్సీ లో చదువుకుంటున్న నిహాల్ ప్రజల వద్ద ఉండే బ్యాటరీలను సులువుగా రీసైకిల్ చేసుకునే విధంగా ఓ ప్రాజెక్ట్ రూపొందించారు.దాంతో అమెరికా ఎన్విరాన్మెంట్ ప్రొటక్షన్ ఏజెన్సీ నిహాల్ ను ఈ అవార్డ్ కు ఎంపిక చేసింది.
అలాగే సునతి అనే భారత సంతతి విద్యార్ధిని వర్జీనియాలో చదువుతోంది.లేక్ బార్గా బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషించింది.
ఓ కొలను శుభ్రం చేయడంలో డాక్టర్ టామ్ అనే పర్యావరణ వేత్తకు ఎంతో సాయం అందించింది.అందుకు గాను ఆమెను ప్రఖ్యాత అవార్డుకు ఎంపిక చేశారు.
ఇక కాలిఫోర్నియా లోని ఓ స్కూల్ లో చదువుకుంటున్న హియా షా వాటర్ ఎడ్యుకేషన్ అండ్ సెక్యూరిటీ అనే ప్రాజెక్ట్ ను రూపొందించారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా మంచి నీటి శుభ్రత ఎప్పటికప్పుడు తెలుస్తుంది.
ముఖ్యంగా నీటి కాలుష్యం తగ్గించడంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంచనా వేశారు.దాంతో హియా షా ను కూడా ఈ అవార్డ్ కు ఎంపిక చేశారు.