స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గొప్ప మనస్సును చాటుకున్నారు.భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ సాకీ పాడిన మొగులయ్యకు ఆర్థిక సాయం ప్రకటించారు.
కిన్నెర కళాకారుడు అయిన మొగులయ్య పేరు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజైన తర్వాత మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ త్వరలోనే 2 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కును మొగులయ్యకు అందించబోతున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
అరుదైన కళాకారుడు అయిన మొగులయ్య తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన వారు.కళలు, జానపద కళారూపాలు మారుతున్న కాలంతో పాటే కనుమరుగవుతున్న సంగతి తెలిసిందే.
మొగులయ్యకు ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పవన్ ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా ఈ సహాయం అందనుందని సమాచారం.
ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.పవన్ వరుస సినిమాల్లో నటించడంతో పాటు కమర్షియల్ అంశాలు ఉన్న కథలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ మొగులయ్యకు ఆర్థిక సాయం ప్రకటించడంపై ఆయనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.కొన్నేళ్ల క్రితం మొగులయ్య తీవ్ర ఆర్థిక కష్టాల వల్ల ఇబ్బందులు పడ్డారు.ఆ సమయంలో పోసాని కృష్ణమురళి మొగులయ్యకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
జానపద కథలను మొగులయ్య కిన్నెర మీటుతూ పాడుతూ గమనార్హం.మొగులయ్యకు నటుడిగా సినిమాల్లో కూడా ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు యూట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్న సంగతి తెలిసిందే.