దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారీ జరిమాన విధించారు.ఫేస్‌బుక్ మాతృసంస్థగా ఉన్న ఈ యాప్ గతంలో కూడా ప్రైవసీ విషయంలో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే! తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రైవసీ పాలసీ చట్టం ఉల్లంఘనల నేపథ్యంలో వాట్సాప్‌కు 225 మిలియన్ల యూరోస్.అంటే అక్షరాల రూ.1,950 కోట్ల జరిమానను విధించింది.ఆ వివరాలు తెలుసుకుందాం.ది వెర్జ్, ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) దీనిపై దాదాపు 89 పేజీల వివరణతో కూడిన నిర్ణయాన్ని ప్రకటించింది.వాట్సాప్ ఈయూ పౌరులకు వారి వ్యక్తిగత డేటాను ఏ విధంగా వాట్సాప్ ఎలా నిర్వహిస్తుందో అనే విషయంపై.అలాగే ఫేస్‌బుక్‌తో ఏ వివరాలు పంచుకుంటుందనే దాని గురించి సరైన వివరాలు తెలియజేయలేదు.
ఇప్పటికే వాట్సాప్ సుదీర్ఘ ప్రైవసీ విధానాన్ని నవీకరించాలని, వినియోగదారులకు వారి డేటాను పంచుకోవడం గురించి తెలియజేసే విధానాన్ని మార్చాలని ఈయూ ప్రభుత్వం ఆదేశించింది.ఇందులో వాట్సాప్, ఇతర ఫేస్‌బుక్ కంపెనీల మధ్య సమాచార ప్రక్రియ గురించిన డేటా సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం కూడ ఉందని ఐరిష్ రెగ్యూలేటర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది యూరోపియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యూలేషన్ (జీడీపీఆర్)కు అనుగుణంగా ఉంటుంది.ఈయూలో టెక్ కంపెనీలు డేటాను ఎలా సేకరించి ఉపయోగించడాన్ని నియంత్రిస్తుంది.2018 మేలో జీడీపీఆర్ అమల్లోకి వచ్చింది.అదేవిధంగా గోప్యతా వ్యాజ్యాలు దాఖలు చేసిన మొదటి కంపెనీల్లో వాట్సాప్ ఒకటి.
వాట్సాప్‌కు చెందిన ఓ అధికారి దీనిపై స్పందించారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.త్వరలో దీనిపై కంపెనీ అప్పీలు చేస్తుందని వాట్సాప్ ప్రతినిధి ఒక మెయిల్‌లో తెలిపారు.‘2018లో ప్రజలకు వాట్సాప్ అందించిన పారదర్శకతకు సంబంధించిన ఈ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు, పైగా జరిమానా పూర్తిగా తగినది కాదని చెప్పారు.వాట్సాప్ భద్రమైన ప్రైవసీ సేవలను అందిస్తోందని అన్నారు.తాము అందించే సమాచారం పారదర్శకంగా, సమగ్రంగా ఉండేలా చూసేందుకు పనిచేశామని, దాన్ని అలాగే కొనసాగిస్తామన్నారు.2018లో ప్రజలకు అందించిన పారదర్శకత గురించి నేటి నిర్ణయంతో తాము విభేదిస్తున్నట్లు తెలిపారు.జీడీపీఆర్ రూల్స్ ప్రకారం విధించిన రెండో అతిపెద్ద పెనాల్టీ ఇది.ఇదే ఏడాది జూలైలో అమెజాన్ ఈయూ గోప్యతా చట్టాలను ఉల్లంఘించినందుకు రికార్డు స్థాయిలో 887 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది.డీపీసీ నిర్ణయం 2018 దర్యాప్తుతో ప్రారంభమైంది.