వేటగాడు.విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్.అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన సినిమా.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది.దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించాడు ఈ చిత్రాన్ని.
రోజా మూవీస్ బ్యానర్‌పై ఎం.అర్జునరాజు ఈ సినిమాను నిర్మించాడు.ఈ సినిమాలోని ఆకుచాటు పిందె తడిసే అని పాట ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ గా నిలిచిపోయింది.ఈ పాటను మద్రాసులోని ఏవీఎం స్టూడియోలో షూట్ చేశారు.
వాన ఎఫెక్ట్ కోసం వాటర్ స్ప్రింక్లర్లను ఉపయోగించారు.ఈ ఒక్క పాటను మూడు రోజుల పాటు షూట్ చేశారు.
వేటగాడు సినిమాలోని ఆకుచాటు అనే పాట ఎవర్ గ్రీన్ రెయిన్ సాంగ్ లో నెంబర్ వన స్థానాన్ని దక్కించుకుంది.తర్వాత వచ్చిన వానపాటలకు ఈ పాట గైడ్ గా ఉపయోగపడింది.
ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్.శ్రీదేవి అందచందాలు జనాలను విపరీతంగా అలరించాయి.
అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు పరిశీలనకు వెళ్లినప్పుడు ఈ పాటకు కొన్ని కట్ లు పడ్డాయి.ఈ పాట అద్భుతంగా ఉందన్న సెన్సార్ సభ్యులు.
ఆకుచాటు పిందె తడిసె.తర్వాత వచ్చే.
కోకమాటు పిల్ల తడిసే అనే సౌండ్ ను కట్ చేయాలని సూచించారు.లేదంటే వేరే పదాలతో రీప్లేస్ చేయాలని చెప్పారు.
ఈ పాటను రాసిన వేటూరి.ఆ సమయంలో శంకరాభరణం సినిమాకు పాటలు రాస్తున్నాడు.వేటగాడు సినిమా పాటకు సెన్సార్ సభ్యులు చెప్పిన కట్ ను ఆయనకు వివరించాడు దర్శకుడు.ఆ పదాల ప్లేస్ లో వేరే పదాలు చేర్చిఇవ్వాలని చెప్పాడు.అప్పుడు వేటూరి నవ్వుతూ ఓ కామెంట్ చేశాడు.పాటలో, జయమాలిని ఆటలో సెన్సార్ బోర్డు కట్ చెప్పకుండా ఉండదని చమత్కరించాడు.
ఆ తర్వాత కోకమాటు పిల్ల తడిసే ప్లేస్ లో కొమ్మచాటు పువ్వు తడిసే అని రాసి పంపించాడు.అప్పటికప్పుడు ఆ బిట్ ను రికార్డు చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి.
అప్పుడు ఈ పాటకు ఓకే చెప్పారు సెన్సార్ సభ్యులు.