1.మెగా స్టార్ కు లోకేష్ శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.
2.ఆన్లైన్ లో విద్యార్థులకు ఇంటర్న్ షిప్
విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఆన్ లైన్ లో అందించాలని తెలంగాణ మహిళా భద్రతా విభాగం నిర్ణయించింది.
ప్రతి నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి మరుసటి నెల ఒకటో తేదీ నుంచి ఇంటర్న్ షిప్ ప్రారంభిస్తారు.డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు.
3.కే యూ యూనివర్సిటీ పరీక్షల తేదీల్లో మార్పులు
కాకతీయ విశ్వవిద్యాలయం ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన డిగ్రీ 6 వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి మల్లారెడ్డి తెలిపారు.తిరిగి ఈ నెల 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
4.వచ్చేనెల 22న పీఈ సెట్
ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చే నెల 22వ తేదీన నిర్వహించనున్నారు.
5.మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు 75% హాజరు
మోడల్ స్కూల్స్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పరీక్షలకు 75.45 శాతం అభ్యర్థులు హాజరయ్యారు.
6.వైఎస్సార్ టిపి జెండా పండుగ
వైయస్సార్ టిడిపి చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్ ఆధ్వర్యంలో బాలాపూర్ మండలం లోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద శనివారం జెండా పండుగ నిర్వహించారు.పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి జెండా ఎగురవేశారు.
7.చంద్రబాబుకి రాఖీ కట్టిన సీతక్క
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆదివారం మాజీ మంత్రి పరిటాల సునీత, పీతల సుజాత , ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.
8.విశ్వబ్రాహ్మణుల రిలే నిరాహార దీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మ బంధు పథకాన్ని ప్రకటించాలని విశ్వకర్మ యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ నెల 23 24 తేదీల్లో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.
9.తెలంగాణ పంచాయతీలకు 432 కోట్ల మంజూరు
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రౌండ్స్ కింద తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 432,49,75000 మంజూరయ్యాయి.
10.వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 76 రోజు కొనసాగుతోంది.ఈరోజు పులివెందులకు చెందిన మున్సపల్ ఉద్యోగస్తులు గంగులయ్య, సురేష్, కడపకు చెందిన ప్రైవేటు ఉద్యోగి జగదీశ్వరరావు విచారణకు హాజరయ్యారు.
11.జనసేన విజయవాడ అధ్యక్షుడిగా పొతిన
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
12.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 23,239 మంది భక్తులు దర్శించుకున్నారు.
13.రేపటి నుంచి సహస్ర సాహితీ సప్తాహం
తెలుగు భాషా, సాహితీ సేవ సంస్థ ‘ సేవ ‘ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 29 వ తేదీ వరకు జూమ్ యాప్ ద్వారా సహస్ర సాహితీ సాప్తాహం నిర్వహించనున్నట్లు సమన్వయకర్తలు ఆకుల మల్లేశ్వరరావు సాకం నాగరాజు తెలిపారు.
14.జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రాక
బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య పై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది ఆ సంస్థ గౌరవ వైస్ చైర్మన్ అరుణ్ హల్దేర్ నేతృత్వంలో విచారణకు ఓ ఉన్నత స్థాయి బృందాన్ని నియమించింది ఈ నెల 24న ఢిల్లీ నుంచి గుంటూరు కు ఆ బృందం రానుంది.
15.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1217 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
16.విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ
బ్యాగులో బుల్లెట్లు దొరికిన కేసులో మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు సిద్ధార్థ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారించారు.
17.కళ్యాణ్ సింగ్ కు ప్రధాని మోదీ నివాళులు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నివాళులర్పించారు.
18.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద తొక్కిసలాట ఏడుగురు మృతి
కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆదివారం మధ్యాహ్నం తొక్కిసలాట చోటు చేసుకుంది.ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,200
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,200.