శ్రీదేవి శోభన్ బాబు.. చిరు బర్త్ డే గిఫ్ట్..!

మెగా డాటర్ సుస్మిత మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించి షూట్ అవుట్ ఎట్ ఆలేర్ క్రైం థ్రిల్లర్ వెబ్ సీరీస్ నిర్మించిన సుస్మిత లేటెస్ట్ గా ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 Megastar Chiranjeevi Birthday Gift From Susmitha Sridevi Shobhan Babu Movie , Ch-TeluguStop.com

సంతోష్ శోభన్ హీరోగా 96 ఫేం గౌరీ కిషన్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.సినిమాను ప్రశాంత్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా సినిమాకు టైటిల్ గా శ్రీదేవి శోభన్ బాబు అని ఫిక్స్ చేశారు.

ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ అందించారు చిత్రయూనిట్.

సుస్మిత ఆమె భర్త విష్ణు ఇక మీదట ఫుల్ టైం నిర్మాతలుగా మారుతున్నట్టు తెలుస్తుంది.

వాళ్లు తీసేది చిన్న సినిమానే అయినా మెగా ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ కు ఢోకా ఉండదు.అందుకే సుస్మిత నిర్మాతగా సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యింది.

మొన్నటివరకు కాస్టూం డిజైనర్ గా చేస్తూ వచ్చిన సుస్మిత నిర్మాతగా తన మార్క్ చూపించాలని చూస్తుంది. ఏక్ మిని కథ సినిమాతో హిట్ అందుకున్న సంతోష్ శోభన్ మారుతి డైరక్షన్ లో మంచి రోజులు వచ్చాయి సినిమా చేశాడు.

ఇప్పుడు శ్రీదేవి శోభన్ బాబుతో మరో క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube