నాని టక్ జగదీష్ సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. సెప్టెంబర్ 10వ తారీకున విడుదల అవ్వబోతున్న ఆసినిమాకు సంబంధించిన వివాదం రాజుకుంది.
లవ్ స్టోరీ సినిమా ను అదే రోజున థియేటర్ల ద్వారా విడుదల చేయబోతుండగా ఓటీటీ లో రాబోతున్న టక్ జగదీష్ వల్ల ఏమైనా సమస్య వస్తుందేమో అనే అనుమానంతో లవ్ స్టోరీ నిర్మాతలు ఆ విషయమై వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారు.నాని తిమ్మరుసు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ థియేటర్ల గురించి పెద్ద స్పీచ్ ఇచ్చాడు.
థియేటర్ల మనుగడ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్న నాని నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చేందుకు సిద్దం అయిన వెంటనే తన టక్ జగదీష్ సినిమా ను ఓటీటీ కి ఇచ్చేశాడు అంటూ తెలంగాణ థియేటర్ సంఘం వారు ఆరోపించారు.
తిమ్మరుసు ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా నాని మాట్లాడిన మాటలే వారికి ప్రధానంగా దొరికాయి.
ఆ వ్యాఖ్యలు చేసి అమెజాన్ ను బ్లాక్ మెయిల్ చేసిన నాని నాలుగు కోట్లు లాగాడు అనేది కొందరి టాక్.ఈ విషయంలో నాని ఉద్దేశ్యం ఏమైనా కూడా కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల నాని చాలా ఇబ్బంది పడ్డాడు.
ఆయన విషయంలో చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశాడు.
వెంకటేష్ హీరోగా రూపొందిన నారప్ప ఇప్పటికే ఓటీటీ వచ్చేసింది.దృశ్యం 2 ను కూడా వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు.రెండు ఓటీటీ రిలీజ్ లకు ఓకే చెప్పిన వెంకటేష్ ను మాత్రం జనాలు ఏమనకుండా కేవలం నానిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొందరు వారిపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
దాంతో వెంటనే తప్పు జరిగిందంటూ సోషల్ మీడియాలో నానికి మద్దతుగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ట్వీట్స్ చేశారు.