ఇక పై వాట్సప్ వెబ్‌ లోనూ ఫోటో ఎడిట్..!

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ ఇష్టంగా వాడే యాప్ వాట్సప్.ఈ మధ్యకాలంలో వాట్సప్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ప్రైవసి విషయంలో వాట్సప్ యూజర్లు కొంత అసహనంతో ఉన్నారు.అందుకు కారణం వాట్సప్ నిబంధనలే.అయితే తమ యూజర్ల వివరాల గొప్యత కోసం వాట్సప్ ప్రత్యేక ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది.వాట్సాప్‌ తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ ను అందుబాటులోకి తెస్తూ వారిని ఆకట్టుకుంటోంది.

 Photo Edit On Whatsapp Web Whatsapp Drawing Tools,whatsapp  , New Feature, Viral-TeluguStop.com

ఇక తాజాగా స‌రికొత్త ఫీచ‌ర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.డ్రాయింగ్‌ టూల్స్‌ పేరుతో వాట్స‌ప్ వెబ్ 2.21.30.7 కొత్త ఫీచ‌ర్‌ ను తీసుకొచ్చింది.అయితే ఈ కొత్త వ‌ర్ష‌న్ వెబ్‌, డెస్క్‌ టాప్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.

ఈ టూల్స్‌ ద్వారా వాట్స‌ప్ వెబ్‌ లోనూ ఫోటోల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు.అయితే ఈ ఫీచ‌ర్ ఇప్పుడే అంద‌రికీ అందుబాటులో ఉండ‌దు.దీని బీటా వ‌ర్ష‌న్‌ను మాత్ర‌మే సంస్థ విడుద‌ల చేస్తుంది.

ప్ర‌స్తుతానికి ఈ ఫీచ‌ర్ సంస్థ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది.

వాట్స‌ప్ ఇప్ప‌టికే వ్యూ వ‌న్స్, న్యూ ఆర్కైవ్ అనే కొత్త ఫీచ‌ర్ల‌ను ఇటీవ‌లే తీసుకొచ్చింది.తాజాగా వాట్స‌ప్ వెబ్ లేదా డెస్క్‌ టాప్ యూజ‌ర్లు ఫోటోల‌ను ఎడిట్ చేసుకునే ఫీచ‌ర్ డ్రాయింగ్ టూల్స్‌ ను తీసుకొచ్చింది.

Telugu Desktop, Latest, Whatsapp, Whatsapp Tools-Latest News - Telugu

ఇప్పటి  నుంచి ఈ ఫీచర్‌ వినియోగిస్తూ వాట్స‌ప్ వెబ్‌ లోనూ ఫోటోల‌ను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.అంతే కాకుండా  ఎవ‌రికైనా ఫోటోను షేర్ చేసేట‌ప్పుడు ఆ ఫోటోను ఎడిట్ చేసే లాగా సరి కొత్త ఆప్ష‌న్ల‌ను వాట్స‌ప్ ప్రవేశ పెట్టింది.అలాగే ఆ ఫోటోకు ఎమోజీలు యాడ్ చేయ‌డం, స్టిక్క‌ర్స్‌, టెక్స్ట్ యాడ్ చేయ‌డం లాంటి  ఆప్ష‌న్ల‌తో డ్రాయింగ్ టూల్స్ అనే ఆప్ష‌న్‌ ను యూజర్లు ఉపయోగించూ కోవచ్చు.అయితే ఇప్ప‌టికే ఈ ఫ్యూచర్ ను  ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజ‌ర్ల‌కు వాట్స‌ప్ ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ ను ప్రవేశ పెట్టింది.

ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ తో వాట్సప్ యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube