సాధారణంగా మనం ఒక్క డ్రెస్ ని మూడు రోజులు వేసుకుంటాం.మహా అంటే ఒక్కవారం రోజులు వేసుకుంటాం.
కానీ ఈ హీరో మాత్రం ఒక్క చొక్కాని రెండేళ్లపాటు వేసుకున్నారు.ఆయన మరెవ్వరో కాదు.
మెగాస్టార్ చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో భారీ అంచనాలతో తీసిన అంజి సినిమా.ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది.ఈ మూవీని భారీ బడ్జెట్‌తో కోడి రామకృష్ణ తెరకెక్కించారు.ఈ సినిమా దాదాపు ఐదేళ్ళ పాటు ఆగుతూ సాగుతూ పడుతూ లేస్తూ మొత్తానికి పూర్తి అయ్యింది.
అయితే ఎంతో కష్టపడి గ్రాఫికల్ వండర్‌గా ఈ సినిమాను కోడి రామకృష్ణ తీస్తే, ఫలితం మాత్రం ఊహించిన విధంగా రాలేదంట.అంతేకాక.2004 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకోకపోయినా, గ్రాఫిక్స్ పరంగా రికార్డులు అందుకుంది.అంతేకాక నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది.అయితే నిజానికి అంజి సినిమా చేయడం దర్శకుడికి యిష్టం లేదంట.నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం చిరంజీవితో ఓ భారీ గ్రాఫికల్ సినిమా చేయాలనే పట్టుదలతో అంజి వచ్చేలా చేశారంట.కాగా.
కోడి రామకృష్ణ తన దగ్గర చిరంజీవికి సరిపోయే డ్యూయల్ రోల్ కథ ఒకటి ఉందట.ఇక కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుంది, అది చేద్దామని చెప్పినా కూడా ఎవ్వరూ వినిపించుకోలేదంట.
ఇక చివరికి అంజి సినిమా ఒప్పుకుంటే, ఈ చిత్రం షూటింగ్ అనుకోని విధంగా మూడు నాలుగేళ్లకు పైగానే కొనసాగింది.అయితే ఇంతకీ ఈ సినిమా సందర్బంగా దర్శకుడు కోడి రామకృష్ణ ఒక్క క్లైమాక్స్ మాత్రమే రెండేళ్ల పాటు చిత్రీకరించారు.దాంతో క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచారంట.ఇక ఈ విషయాన్ని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కాగా.ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి అంజి మరుపురాని సినిమా అని చెప్పుకొచ్చారు.