రెండేళ్లపాటు ఒకే చొక్కా ఉతక్కుండా వాడాడంట ఆ స్టార్ హీరో..??

సాధారణంగా మనం ఒక్క డ్రెస్ ని మూడు రోజులు వేసుకుంటాం.మహా అంటే ఒక్కవారం రోజులు వేసుకుంటాం.

కానీ ఈ హీరో మాత్రం ఒక్క చొక్కాని రెండేళ్లపాటు వేసుకున్నారు.ఆయన మరెవ్వరో కాదు.

మెగాస్టార్ చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో భారీ అంచనాలతో తీసిన అంజి సినిమా.

ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది.ఈ మూవీని భారీ బడ్జెట్‌తో కోడి రామకృష్ణ తెరకెక్కించారు.

ఈ సినిమా దాదాపు ఐదేళ్ళ పాటు ఆగుతూ సాగుతూ పడుతూ లేస్తూ మొత్తానికి పూర్తి అయ్యింది.

అయితే ఎంతో కష్టపడి గ్రాఫికల్ వండర్‌గా ఈ సినిమాను కోడి రామకృష్ణ తీస్తే, ఫలితం మాత్రం ఊహించిన విధంగా రాలేదంట.

అంతేకాక.2004 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకోకపోయినా, గ్రాఫిక్స్ పరంగా రికార్డులు అందుకుంది.

అంతేకాక నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది.అయితే నిజానికి అంజి సినిమా చేయడం దర్శకుడికి యిష్టం లేదంట.

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం చిరంజీవితో ఓ భారీ గ్రాఫికల్ సినిమా చేయాలనే పట్టుదలతో అంజి వచ్చేలా చేశారంట.

కాగా.కోడి రామకృష్ణ తన దగ్గర చిరంజీవికి సరిపోయే డ్యూయల్ రోల్ కథ ఒకటి ఉందట.

ఇక కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుంది, అది చేద్దామని చెప్పినా కూడా ఎవ్వరూ వినిపించుకోలేదంట.

"""/"/ ఇక చివరికి అంజి సినిమా ఒప్పుకుంటే, ఈ చిత్రం షూటింగ్ అనుకోని విధంగా మూడు నాలుగేళ్లకు పైగానే కొనసాగింది.

అయితే ఇంతకీ ఈ సినిమా సందర్బంగా దర్శకుడు కోడి రామకృష్ణ ఒక్క క్లైమాక్స్ మాత్రమే రెండేళ్ల పాటు చిత్రీకరించారు.

దాంతో క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచారంట.

ఇక ఈ విషయాన్ని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కాగా.ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి అంజి మరుపురాని సినిమా అని చెప్పుకొచ్చారు.

చిన్న పని చేస్తే చాలు.. ప్రభాస్ సలార్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చు?