కరోనా కంగారుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు.
అసలు పూర్తిగా కరోనా మహమ్మారి భయం లేకుండా జీవించే రోజు ఎప్పుడు వస్తుందా? అసలు వస్తుందా? రాదా? అనే అనుమానాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.కరోనా డేంజర్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు వ్యాక్సిన్ బ్రహ్మస్త్రంలా పని చేస్తుందని అనేక మంది డాక్టర్లు మొత్తుకుంటున్నారు.
అయినా కూడా కొంత మంది నిర్లక్ష్య ధోరణితో హా.మనకేం అవుతుందిలే అని ప్రవర్తిస్తున్నారు.అటువంటి వారి వల్లే కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతూ పోతుంది.సెకండ్ వేవ్ క్రియేట్ చేసిన భయానక పరిస్థితుల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బయటపడుతోంది.కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న అనేక దేశాలలో కరోనా కేసులు పెరగడం అందర్నీ ఆందోళనలకు గురి చేస్తోంది.
జనాలు ఇంతలా భయపడి చస్తుంటే కొందరు మాత్రం తమకేం సంబంధం లేదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.
మామూలు మనుషులంటే ఏమో అనుకోవచ్చు.కానీ స్వయాన మీడియా రంగంలో పనిచేసే వారే ఇలా చేయడం గమనార్హం.
ప్రంపచ ప్రఖ్యాతి గాంచిన సీఎన్ఎన్ వార్తా సంస్థలో పని చేసే ముగ్గురు సిబ్బంది వ్యాక్సిన్ వేసుకోకుండానే ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తిస్తుండడంతో విషయం తెలుసుకున్న చీఫ్ జెఫ్ జుకర్ వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
ముగ్గురిని తొలగించినట్లు ప్రకటించారు కానీ ఉద్యోగుల పేర్లు, వారు పని చేసే స్థలం తదితర వివరాలను సీఎన్ఎన్ వెల్లడించకపోవడం గమనార్హం.ఆఫీసుకు వచ్చి పని చేసే వారు మాత్రమే కాకుండా ఫీల్డ్ కు వెళ్లే రిపోర్టర్లు కూడా తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని చీఫ్ జెఫ్ జుకర్ తెలియజేశారు.వ్యాక్సిన్ వేసుకోని వారిని సహించే ప్రసక్తే లేదని ఆయన సిబ్బందిని హెచ్చరించారు.