మాజీమంత్రి టీడీపీ నేతకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..!!

తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా నీ ఇటీవల పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.మైనింగ్ కి సంబంధించి ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో పాటు తనిఖీలకు వెళ్ళిన క్రమంలో ఘర్షణల ఘటనలు చోటు చేసుకోవడంతో దేవినేని ఉమా వర్సెస్ వైసీపీ అన్న తరహాలో వివాదం నెలకొంది.

 Tdp Leader Devineni Uma Got Bail Devineni Uma, Tdp, High Court, Andra Pradesh ,-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా దేవినేని ఉమా పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించడం జరిగింది.

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమ అరెస్టునీ ఖండించడం మాత్రమే కాక జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబుదేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించి నేరుగా ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పటం కూడా జరిగింది.ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి సీఎం వైఎస్ జగన్ కి పరిపాలన చేతకాదని, ప్రత్యర్థుల పై అక్రమ కేసులు పెడుతూ పరిపాలన గాలికొదిలేశారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా దేవినేని ఉమా కి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో సంతోషం నెలకొంది.కృష్ణాజిల్లా జీ.కొండూరు పోలీస్ స్టేషన్ లో దేవినేని ఉమా పై కేసులు నమోదయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube